స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.చంద్రబాబు ( Chandrababu )క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిన సంగతి తెలిసిందే.
సీఐడీ వాదనలతో ఏపీ హైకోర్టు ఏకీభవించడంతో పాటు పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటన చేసింది.విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో కూడా షాక్ తగిలింది.
ఐదు రోజుల కస్టడీ కావాలని సీఐడీ కోరగా 2 రోజుల కస్టడీకి అనుమతులు ఇస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది.
చంద్రబాబును( Chandrababu ) జైలులోనే విచారిస్తామని సీఐడీ కోర్టుకు తెలపగా చంద్రబాబును విచారిస్తే ఈ కేసులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి.బాలయ్య టీడీపీలో యాక్టివ్ అవుతుండగా టీడీపీని బాలయ్య హస్తగతం చేసుకోనున్నారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.అయితే బాలయ్య ( Balakrishna )అభిమానులు మాత్రం అలా కామెంట్లు చేసేవాళ్లకు ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు.
తాజాగా ఒక సందర్భంలో బాలయ్య మీకు నేనున్నానని ధైర్యంగా ఉండాలని అవసరమైతే రాష్ట్రం మొత్తం పర్యటిస్తానని రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని కామెంట్లు చేశారు.
టీడీపీని నిలబెట్టడానికి పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడానికి బాలయ్య తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.అంతే తప్ప ఏదో ఆశించి బాలయ్య టీడీపీ కార్యక్రమాల విషయంలో జోక్యం చేసుకోవడం లేదు.
బాలయ్య గురించి, ఆయన మంచితనం గురించి, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలిసి కూడా ఆయనను ఇలా నిందించడం ఎంతవరకు కరెక్ట్ అని కామెంట్లు వ్యకమవుతున్నాయి.బాలయ్యను అవమానించే విధంగా కామెంట్లు చేయవద్దని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.బాలయ్య రాజకీయాలకు సంబంధించి ఏ విధంగా ముందడుగులు వేస్తారో చూడాల్సి ఉంది.
బాలయ్య నటించిన భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) మూవీ వచ్చే నెలలో థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్ పై కూడా బాలయ్య దృష్టి పెట్టాల్సి ఉంది.