భారతీయ సినీ చరిత్రలోనే తెలుగు సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది.తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి.
అయితే తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ముందుగానే రివ్యూలను ఇస్తూ ఉమైర్ సంధు వార్తల్లో నిలుస్తున్నారు.విచిత్రం ఏంటంటే ఉమైర్ సంధు పాజిటివ్ రివ్యూలు ఇచ్చిన సినిమాలు నెగిటివ్ ఫలితాలను అందుకుంటున్నాయి.
మెజారిటీ సినిమాల విషయంలో ఉమైర్ సంధు అంచనాలకు భిన్నంగా సినిమాలు ఫలితాలను అందుకుంటున్నారు.అయితే తెలుగు సినీ అభిమానులు మాత్రం.
తెలుగు సినిమాల విషయంలో ఉమైర్ సంధు నోరు మూయించాలని కామెంట్లు చేస్తున్నారు.వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలకు నెగిటివ్ రివ్యూలు ఇస్తూ ఆ సినిమాల బిజినెస్ కు ఉమైర్ సంధు తీవ్ర స్థాయిలో నష్టం చేస్తున్నారు
ఉమైర్ సంధు కొన్నిరోజుల క్రితం ప్రభాస్ కృతి సనన్ పెళ్లి చేసుకోనున్నారని ఒక ఫేక్ వార్తను ప్రచారంలోకి తెచ్చారు.ప్రభాస్ టీం వెంటనే స్పందించడంతో ఈ వార్తలు ఆగిపోయాయి.ఉమైర్ సంధు మీద చర్యలు తీసుకునే దిశగా టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు అడుగులు వేస్తే మంచిది.
అలా చేయని పక్షంలో ఉమైర్ సంధు మరిన్ని తప్పులు చేసే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఫ్యాన్స్ సైతం ఉమైర్ సంధు విషయంలో తెగ ఫైర్ అవుతున్నారు.ఉమైర్ సంధు ఎప్పటికీ మారరని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.తనను తాను సెన్సార్ సభ్యుడిగా ప్రచారం చేసుకుంటున్న ఉమైర్ సంధుపై కేసులు నమోదు చేయాలని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
ఈ కామెంట్ల విషయంలో ఉమైర్ సంధు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.ఇండస్ట్రీ పెద్దలు సైతం ఉమైర్ సంధు విషయంలో సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.