వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ లోని ఓవల్ వేదికగా ఈ నెల 7 నుంచి 11 వరకు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ ఫైనల్ మ్యాచ్లో విజేతగా నిలవడం కోసం భారత్, ఆస్ట్రేలియా లు సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నాయి.
ఇప్పటికే భారత జట్టు ఇంగ్లాండ్ చేరింది.అక్కడ బౌన్సీ పిచ్ లపై ప్రాక్టీస్ ముమ్మరం చేసింది.
ఈ రెండు దేశాల జట్లకు ఈ మ్యాచ్లో గెలవడం ఎంతో కీలకం.ఈ ఫైనల్ మ్యాచ్ గెలిచిన జట్టు క్రికెట్ ప్రపంచంలోనే సరికొత్త రికార్డు సృష్టించనుంది.
కానీ డబ్ల్యూటీసి ఫైనల్ కోసం టీం సెలక్షన్ లో బీసీసీఐ పై క్రికెట్ అభిమానులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు.రిషబ్ పంత్ గాయం కారణంగా క్రికెట్ కు దూరంగా ఉన్నప్పటి నుంచి శ్రీకర్ భరత్ రెగ్యులర్ వికెట్ కీపర్ గా కొనసాగుతున్నాడు.ఈ క్రమంలోని ఈ ఏడాది మార్చిలో జరిగిన ఆస్ట్రేలియా- భారత్( Australia ) నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో కూడా శ్రీకర్ భరత్ వికట్ కీపర్ గా ఉన్నాడు.అయితే శ్రీకర్ భరత్ ఆశించిన స్థాయిలో మెప్పించలేక విఫలం అయ్యాడు.
మరోవైపు బ్యాటింగ్ లో కూడా ఆకట్టుకోలేకపోయాడు.
డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కోసం బీసీసీఐ ఇద్దరూ వికెట్ కీపర్ లను సెలెక్ట్ చేసింది.శ్రీకర్ భరత్( Srikar Bharat ) తో పాటు ఇషాన్ కిషన్ లను సెలెక్ట్ చేసింది. ఇషాన్ కిషన్( Ishan Kishan ), శ్రీకర్ భరత్ కు బ్యాకప్.
ఈ విషయంపై అభిమానులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు.వృద్ధి మాన్ సాహ( Wriddhiman Saha వికెట్ కీపర్ గా ఐపీఎల్ లో అద్భుతంగా రాణించాడని, ఇతనిని సెలెక్ట్ చేయడం బీసీసీఐ సెలెక్టర్లు విస్మరించారని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.