Prabhas: ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదని ఫ్యాన్స్ చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే.. ప్రభాస్ కూతురి ఫోటో ఇదేనంటూ?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు హీరో ప్రభాస్.( Prabhas ) నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నారు ప్రభాస్.

 Fans Creating Prabhas Anushka Shetty Family Photo With Ai-TeluguStop.com

అయితే ప్రభాస్ అభిమానులు ప్రభాస్ ఎప్పుడెప్పుడు ఒక ఇంటి వాడవుతాడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.కానీ ప్రభాస్ తన పెళ్లి విషయంలో ప్రతిసారి కూడా అభిమానులకు నిరాశే మిగులుస్తున్నారు.

అప్పుడప్పుడు బాహుబలి సినిమా తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటానన్న ప్రభాస్ ఆ తర్వాత మూడు నాలుగు సినిమాలు విడుదల అయినా కూడా ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు.ఇక ప్రభాస్ పెళ్లి విషయంలో అయితే ఇప్పటికే కొన్ని వందల వార్తలు వినిపించాయి.

అనుష్క ని( Anushka ) పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఎప్పటినుంచో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.ఇటీవల విడుదల అయినా ఆది పురుష్ సినిమా తర్వాత కృతి సనన్ తో( Kriti Sanon ) ప్రేమాయణం నడుపుతున్నాడని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని వార్తలు వినిపించాయి.కానీ ఆ వార్తలపై ఇప్పటివరకు ప్రభాస్ స్పందించలేదు.ప్రభాస్ అభిమానులు అనుష్కను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని వారి జోడి సూపర్ గా ఉంటుందని కామెంట్లు చేస్తూనే ఉన్నారు.

కానీ అనుష్క ప్రభాస్ లు మాత్రం మేము కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అలాంటి ఉద్దేశం లేదని చెబుతూ వస్తున్నారు.అయితే ఇప్పటివరకు ప్రభాస్ తన పెళ్లి విషయంపై ఏదో ఒక క్లారిటీ ఇస్తాడు అని ఎంతో ఆశగా ఎదురు చూశారు.

ఇక ప్రభాస్ తన పెళ్లి విషయంపై స్పందించేలా కనిపించకపోవడంతో ఏకంగా ప్రభాస్ అభిమానులు( Prabhas Fans ) ఎవరు ఊహించని విధంగా ఒక పని చేసేసారు.ఇంతకీ ఆ పని ఏమిటంటే.ప్రస్తుతం ఉన్న AI టెక్నాలజీ ఉపయోగించి నెటిజెన్స్ ఏవేవో అద్భుతాలు చేస్తున్నారు.ఈక్రమంలోనే ప్రభాస్ అభిమానులు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సహాయం తీసుకోని అనుష్కతో ప్రభాస్ కి పెళ్లి చేసేశారు.అయితే పెళ్లితో మాత్రమే ఆగలేదు.

వారిద్దరికీ ఒక పాపని కూడా పుట్టించేశారు.ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను #Pranushka అంటూ వైరల్ చేస్తున్నారు.

ఇక వీటిపై మీమర్స్ ఫన్నీ మీమ్స్ చేస్తుండగా అవి చూసిన ఫాలోయర్స్ నవ్వుకుంటున్నారు.కొందరు ఏం క్రియేటివిటీ రా బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube