తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి వారిలో నాగ వంశీ ( Nagavamshi ) ఒకరు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకోవచ్చారు.ఇకపోతే తాజాగా మ్యాడ్( Mad ) సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక వరుస సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నటువంటి నాగ వంశీ లియో సినిమా( Leo Movie ) తెలుగు హక్కులను కొనుగోలు చేశారు.కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ విధంగా లియో సినిమా( Leo Movie ) దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ఇక ఈ సినిమా తెలుగు హక్కులను కొనుగోలు చేసినటువంటి నాగవంశీ ఇంకా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టకుండా సైలెంట్ గా ఉన్నారు అయితే ఇప్పటివరకు ఈయన తన సొంత బ్యానర్ లో వచ్చినటువంటి మ్యాడ్ సినిమా ప్రమోషన్లలోనే బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమా విడుదల కావడంతో ఇకపై లియో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెడతారని అందరూ భావిస్తున్నటువంటి తరుణంలో ఈయన లియో సినిమా గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

నేను మొదటిసారి ఒక డబ్బింగ్ సినిమాని కొనుగోలు చేశానని అయితే ఇదే నా మొదటి ఆఖరి డబ్బింగ్ సినిమా అంటూ ఈయన కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.లియో ( LEO )సినిమా విషయంలో నాగ వంశీ ఎందుకు అలా రెస్పాండ్ అయ్యాడో తెలియదు.లియో సినిమా రిలీజ్ అయ్యే సమయంలో బాలయ్య భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) కూడా థియేటర్స్ లోకి రానుంది.నాగ వంశీ లియో సినిమాని ఎక్కువగా ప్రమోట్ చేయకపోవడం భగవంత్ కేసరి సినిమాకి మరింత కలిసి రానుంది.
ఇక ఈయన బాలయ్యతో కూడా బాబి డైరెక్షన్లో రాబోతున్న సినిమాని నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.







