మామూలుగా హీరో, హీరోయిన్ లు బయట కనిపించారు అంటే చాలు అభిమానులు ఎగబడి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నప్పుడు సెలబ్రిటీలు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు.
అటువంటి సెలబ్రిటీలు సీరియస్ కూడా అవుతూ ఉంటారు.కానీ అభిమాని భుజంపై చెయ్యి వేసి నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చే సెలబ్రిటీలు చాలా తక్కువగా ఉంటారని చెప్పవచ్చు.
ఒకవేళ ఫోటోలు దిగినా కూడా అలా చేతులు వేయడం దగ్గరగా రావడం అనేది చాలా తక్కువ.కానీ ఒక హీరోయిన్ మాత్రం అభిమాని ఫోటో కావాలి అని అడగడంతో అతని భుజంపై చేయి వేసి అతనితో ఫోటోలు దిగింది.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అన్న విషయానికి వస్తే.ఆమె మరెవరో కాదు కన్నడ హీరోయిన్ రమ్య దివ్య స్పందన.( Actress Ramya Divya Spandana ) తాజాగా రమ్య ఒక అభిమానితో ఫోటో దిగారు.ఆ సమయంలో అతడితో ఎంతో సరదాగా మాట్లాడారు.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.అభిమానులతో ఎంతో సింప్లిసిటిగా ముచ్చటిస్తున్న రమ్యను చూసి విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
హీరోయిన్ అందులో రాజకీయ నాయకురాలు( Politician ) అయి ఉండి కూడా ఆమె ఇంత సింప్లిస్టిగా ఉండటం చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా ఈమె దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన అభి సినిమాతో కన్నడ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత కుట్టు చిత్రంతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.ఈ మూవీ హిట్ కావడంతో రమ్యకు అవకాశాలు క్యూకట్టాయి.కన్నడ, తమిళంలో వరుస చిత్రాలు చేసిన రమ్య తెలుగులోనూ నటించి మెప్పించింది.నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అభిమన్యు సినిమాతో( Abhimanyu Movie ) తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది రమ్య.
అలా రమ్య హీరోయిన్ గా మొత్తం 20 సినిమాల్లో నటించింది.ఇక ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరం అయ్యింది.ఇక ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్నారు.కాంగ్రెస్ ఎంపీగా( Congress MP ) ప్రజలకు సేవ చేశారు.
అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజీనామా చేశారు.అయితే ఇటు సినిమాలకు పూర్తిగా దూరమైన రమ్య చాలా కాలంగా రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నారు.
ఇక ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు.యాపిల్ బాక్స్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి కొత్త సినిమాలను నిర్మిస్తున్నారు.
అయితే ఇటు నిర్మాతగానూ కొనసాగుతున్నారు రమ్య.