సాధారణంగా వయసు పైబడే కొద్దీ ఎముకల్లో సాంద్రత తగ్గుతుంది.దాంతో మోకాళ్ళ నొప్పులు తలెత్తుతుంటాయి.
కానీ ఇటీవల రోజుల్లో చాలా మంది ముప్పై ఏళ్లకే మోకాళ్ళ నొప్పుల( knee pain )తో బాధపడుతున్నారు.అంటే ముప్పై ఏళ్లకే మీ ఎముకలు బలహీనంగా మారాయి అని అర్థం.
పొరపాటున దీన్ని నిర్లక్ష్యం చేస్తూ మోకాళ్ల నొప్పుల నుంచి రిలీఫ్ పొందడం కోసం పెయిన్ కిల్లర్స్ పై ఆధారపడ్డారా.మీ లైఫ్ డేంజర్ లో పడినట్టే.
చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు మదనపడుతుంటే కచ్చితంగా జాగ్రత్తపడాలి.ఎముకలను దృఢపరుచుకునేందుకు ప్రయత్నించాలి.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే పొడి అద్భుతంగా సహాయపడుతుంది.ఈ పొడిని వన్ టేబుల్ స్పూన్ చొప్పున రోజు తీసుకుంటే ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ బోన్ బూస్టర్ పౌడర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక కప్పు ఫూల్ మఖానా వేసి వేయించుకోవాలి.
ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు బాదం, రెండు టేబుల్ స్పూన్లు గసగసాలు వేసి వేపుకోవాలి.
చివరిగా ఒక చిన్న కప్పు వేపుడు శనగపప్పు మరియు ఎనిమిది గింజ తొలగించిన ఎండు ఖర్జూరాల( Dry dates )ను స్లైట్ గా వేయించుకొని పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న ఫూల్ మఖానా, బాదంపప్పు( Almonds ), గసగసాలు, వేపుడు శనగపప్పు, ఎండు ఖర్జూరం, ఐదు యాలకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి.మెత్తని పొడిలా మిక్సీ పట్టుకుని ఒక బాక్స్ లో నింపుకోవాలి.
ఈ పొడిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు.ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో తయారు చేసుకున్న పొడిని వన్ టేబుల్ స్పూన్ చొప్పున మిక్స్ చేసి సేవించాలి.ఈ పొడిలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి.ఇవి ఎముకల సాంద్రత ను పెంచుతాయి.బలహీనమైన ఎముకలను సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తాయి.అలాగే మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచి సహజంగానే విముక్తిని కలిగిస్తాయి.
కాబట్టి మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు తప్పకుండా ఈ బోన్ బూస్టర్ పౌడర్ ను తయారు చేసుకుని తీసుకునేందుకు ప్రయత్నించండి.ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోండి.