తమిళ సూపర్ స్టార్ విజయ్ తెలుగు లో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే.తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా లో విజయ్ నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి.సినిమా లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.
సినిమా లో సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా నటించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ఫ్యామిలీ హీరోగా మంచి పేరును దక్కించుకున్నాడు.
దాంతో ఈయన స్టార్ గా నిలిచాడు.సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరియు విలన్ గా సినిమాలు చేస్తున్నాడు.
ఆ సినిమాలు కాస్త శ్రీకాంత్ కు మంచి ఇమేజ్ ను తెచ్చి పెట్టాయి.అందుకే శ్రీకాంత్ ఉండటం వల్ల విజయ్ సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వంశీ పైడిపల్లి మహర్షి సినిమా తర్వాత మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.కాని సినిమాల ఎంపిక విషయంలో మాత్రం చాలా ఆచితూచి వ్యవహరించాడు.తమిళ స్టార్ విజయ్ తో దిల్ రాజు సినిమాను నిర్మించాలి అనుకోవడం.వంశీ పైడిపల్లి మంచి కథ చెప్పడం తో ఓకే అయ్యింది ప్రాజెక్ట్.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఇదే ఏడాది లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.వచ్చే ఏడాది సంక్రాంతికి ఇతర సినిమా లు ఉండటం తో సమ్మర్ వరకు వెయిట్ చేసే అవకాశం లేకపోవడంతో ఇదే ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో విడుదల చేసేలా దర్శకుడు వంశీ పైడిపల్లి ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.







