ప్రజెంట్ పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు ప్రతీ ఒక్కరు సోషల్ మీడియాలో ఉంటున్నారు.ఇకపోతే ఫేస్‌బుక్ అకౌంట్ లేని వారు దాదాపుగా లేరు అనే చెప్పొచ్చు.
నెట్టింట ఫేస్‌బుక్ ప్రభంజనమే సృష్టిస్తోంది.ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్ బుక్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
యూజర్స్ ప్రైవసీ విషయంలో భద్రత లేదని అప్పట్లో విమర్శలు వచ్చినప్పటికీ ఫేస్‌బుక్ మార్కెట్ లో దూసుకువెళ్తోంది.అయితే, ఈ సంస్థపై ఆరోపణలు అయితే ఆగడం లేదు.
తాజాగా ‘ఫేస్ బుక్’కు వ్యతిరేకంగా ప్రముఖ జర్నల్ ది వాల్‌స్ట్రీట్‌లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి.ఫేస్‌బుక్ ఉద్యోగులు, యాజమాన్యం, సిబ్బంది కస్టమర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఐడెంటిఫై చేయడంలో విఫలమైందని పేర్కొంటూ కథనాన్ని పబ్లిష్ చేసింది.
ఈ కథనంలో ఫేస్ బుక్ కస్టమర్స్ సమస్యలు గుర్తించినప్పటికీ వాటిని సాల్వ్ చేయడంతో సరికొత్త విధానాలు తీసుకురాలేకపోయిందని ఆరోపించారు.ఇకపోతే సెలబ్రిటీలకు ఫేస్‌బుక్ నుంచి మినహాయింపులు, ఇన్‌స్ట్రాగాం యాప్ వినియోగించే కస్టమర్స్‌పై నెగెటివ్ ఇంపాక్ట్స్ కలిగేలా అల్గారిథమ్ మార్పులును ఫేస్‌బుక్ చేసిందని కథనంలో విమర్శించారు.
మొత్తంగా ఫేస్ బుక్ విధానాలకు వ్యతిరేకంగా రకరకాల కథనాలను జర్నల్‌లో ప్రచురించారు.

ఈ కథనాలపై ఫేస్‌బుక్ గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లాగ్ స్పందించారు.ది వాల్ స్ట్రీట్ జర్నల్ కావాలనే ఫేస్‌బుక్ లీడర్ షిప్, ఉద్యోగుల పట్ల తప్పుడు భావం కలిగించేందుకుగాను కథనాలు ప్రచురించిందన్నారు.ఉద్దేశపూర్వకంగానే ఈ ఆరోపణలు జర్నల్‌లో చేశారంటూ ఫైర్ అయ్యారు.
జర్నల్‌లో ప్రచురితమైన విషయాలన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు.కొవిడ్ వ్యాక్సిన్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫేస్ బుక్ పోస్టులు చేసిందంటూ ఈ సందర్భంగా నిక్ క్లాగ్ గుర్తు చేశారు.
పరిశోధనా విభాగంలో ఎఫ్‌బీ సరికొత్త ఒరవడులు సృష్టించిందని చెప్పారు.