జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా పాపులర్ అయిన కమెడియన్లలో ఫైమా ఒకరనే సంగతి తెలిసిందే.ఫైమా తనదైన శైలిలో వేసే పంచ్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ఆ తర్వాత రోజుల్లో బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఫైమా( Faima ) ఈ షో ద్వారా కూడా మంచి పేరును సొంతం చేసుకున్నారు.బిగ్ బాస్ షో వల్ల ఫైమా ఆర్థికంగా కూడా స్థిరపడ్డారని సమాచారం అందుతోంది.
స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే పలు షోలలో ఫైమా సందడి చేస్తున్నారు.ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఫైమా నన్ను చిన్నపిల్లలా చూసుకోవాలి అని కామెంట్ చేశారు.
ఫైమా పటాస్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నట్టు గతంలో కొన్ని వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం ప్రవీణ్, ఫైమా వేర్వేరు షోలతో బిజీగా ఉండటంతో వీళ్లిద్దరూ కలిసి కనిపించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కెరీర్ విషయంలో ఫైమా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇస్తానని గతంలో ఫైమా వెల్లడించిన నేపథ్యంలో ఈ షోలో అమె రీఎంట్రీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.బిగ్ బాస్ షో ( Bigg Boss Show )తర్వాత ఫైమా రెమ్యునరేషన్ పెరిగిందని తెలుస్తోంది.ఫైమాకు పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో సైతం ఎక్కువగా ఆఫర్లు అయితే వస్తున్నాయని సమాచారం అందుతోంది.

కెరీర్ విషయంలో ఫైమా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఫైమా త్వరలో పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెబుతారేమో చూడాలి.ఫైమాకు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని ఆమె అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.ఇతర ఛానెళ్లలో కూడా ఫైమాకు ఆఫర్లు వస్తున్నా బిగ్ బాస్ షో అగ్రిమెంట్ వల్ల ఆమె ఆ ఆఫర్లకు నో చెబుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.







