Bigg Boss6 Faima : ఆట మార్చేస్తున్న ఫైమా.. ఎవిక్షన్ పాస్ మహిమే ఇదంతా..?

బిగ్ బాస్ సీజన్ 6 లో ఫైమాకి మరో లక్కీ ఛాన్స్ వచ్చింది.శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో ఫైమా ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకుంది.

ఫైమా తో పాటుగా ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకునేందుకు రేవంత్, శ్రీహాన్ పోటీ పడ్డారు.అయితే వారిలో హౌస్ మెట్స్ అందరి సహాకరంతో ఫైమా ఈ పాస్ దక్కించుకుంది.

అయితే ఎవిక్షన్ పాస్ తనకు రావడంతో దాదాపు ఈ సీజన్ లో ఫైమా టాప్ 5 బెర్త్ కన్ ఫర్మ్ అయినట్టే.ఇక తనతో ఈక్వల్ గా పోటీలో ఉన్న వారికి ఫైమా ఎవిక్షన్ పాస్ గెలుపొందడం పెద్ద షాక్ ఇచ్చింది.

రిస్క్ అనుకునే టైం లో ఫైమా తప్పకుండా ఎవిక్షన్ పాస్ ఉపయోగించుకోవచ్చు.అయితే ఫైమా తను సేఫ్ అవుతా అన్న కాన్ఫిడెంట్ ఉన్న టైం లో ఈ పాస్ ని మరొకరి కోసం కూడా వాడుతా అని అన్నది.

Advertisement

మొత్తానికి ఫైమా కి వచ్చిన ఈ ఎవిక్షన్ పాస్ మాత్రం ఆటని మార్చేస్తుందని చెప్పొచ్చు.ఫైమా తన ఆటతీరుతో ప్రతి వారం సేవ్ అవుతూ వస్తుంది.

ఈ ఎవిక్షన్ పాస్ ఆమెకన్నా ఎవరికైనా తన స్నేహితులకు వాడే ఛాన్స్ కనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు