కమల్ హాసన్ కి విలన్ గా మలయాళీ స్టార్ హీరో

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం భారతీయుడు సీక్వెల్ ని పక్కన పెట్టి లోకేష్ కనగరాజ్ తో విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాకి సంబందించిన టీజర్ ఇప్పటికే రిలీజ్ భారీ హైప్ క్రియేట్ చేసింది.

మరోసారి సోషల్ ఎలిమెంట్ తో కమల్ హాసన్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్న కమల్ వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లి సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలని అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే లోకేష్ ప్రస్తుతం విజయ్ తో మాస్టర్ సినిమాని పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేశారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని స్టూడెంట్ పాలిటిక్స్ నేపధ్యంలో ఆవిష్కరించినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి మాస్టర్ టీం రెడీ అవుతుంది.

Advertisement

ఇక సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో లోకేష్ విక్రమ్ మీద ఫోకస్ పెట్టబోతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో కమల్ హాసన్ ని ప్రతినాయకుడుగా లోకేష్ మరో స్టార్ ని తీసుకొచ్చాడు.మలయాళీలో విభిన్న కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ఫాహిద్ ఫాజిల్ విల‌న్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

ఫాహిద్ ఫాజిల్ గతంలో మలయాళీ సినిమాలలో విలన్ గా నటించి మెప్పించాడు.ఫస్ట్ టైం ఓ తమిళ్ సినిమాలో అది కూడా విలక్షణ నటుడుగా పేరున్న కమల్ హాసన్ లాంటి స్టార్ తో నటించడం కచ్చితంగా ప్రత్యేకం అని చెప్పాలి.

ఇద్దరు విలక్షణ నటులు ఒకరితో ఒకరు పోటీ పడి నటిస్తే తెరపై చూసే ప్రేక్షకులని ఎంత గొప్పగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు