ఎందుకు ఈ చెత్త అంత ఇంటర్నెట్ లో నింపుతున్నాం అని ఒక్కసారైనా రాసేవారు ఆలోచిస్తే బాగుండు.మెగాస్టార్ తనకు వారసుడు రాబోతున్నాడు అని ప్రకటించాడో లేదో ఇలా ఎవరికి నచ్చిన న్యూస్ ని వారు వడ్డిచేస్తున్నారు.
సినిమాల్లో నటించే చాల మంది హీరోయిన్స్ పిల్లలను కనడం ఇష్టం లేక సరోగసి ద్వారా బిడ్డను కనాలని అనుకుంటున్నారు.అందుకు వారి కారణాలు వారికి ఉన్నాయ్.
కొంతమందిని పిల్లలు పుట్టాక ఇలా చేస్తుంటే మరి కొంత గ్లామర్ ప్రపంచం లో ఉండాలి కాబట్టి అందాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశం తో ఇలా సరోగసి పద్దతిలో పిల్లలను కంటున్నారు.ఏది ఏమైనా రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారు అని వార్త మెగా ఫ్యామిలీ తో పాటు మెగా అభిమానుల్లో కూడా ఆనందాన్ని నింపింది. కానీ ఈ ఆనందం ఎక్కువ సేపు ఉండటం మీడియా కి, మరి ముఖ్యం గా సోషల్ మీడియా కు ఇష్టం లేనట్టుగా ఉంది.ఎందుకంటే సరోగసి లో పిల్లలను కంటున్నారు ఈ జంట అంటూ కొన్ని వెబ్ సైట్స్ రాస్తున్నారు.
ఒక వేళా రామ్ చరణ్ సరోగసి ద్వారా తండ్రి అవ్వాలనుకుంటే పదేళ్ల పాటు వేచి ఉండాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి.లేదంటే వారు ఏ పద్దతిలో మెగా వారసుడిని కంటే మీడియా కు ఎందుకు మరి ఈ ఉత్సాహం.
నిజమో కాదో తెలియకుండా ఎవరికి ఏది అనిపిస్తే అదే రాస్తున్నారు.ఇన్నాళ్లు ఉపాసన ఎందుకు పిల్లలు కనలేదు అని అడిగారు.ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ చెప్తే ఆమె ఎలా కనబోతుంది అంటూ ఊహాగానాలు చేస్తున్నారు.

ఉపాసన మరి అంత హీరోయిన్స్ లాగ బుర్ర లేకుండ ఉంటుందని అనుకోవడం పొరపాటే.ఆమె రెండు ఉన్నత కుటుంబాలకి చెందిన వారసురాలు.ఏ నిర్ణయం తీసుకున్న ఒకటికి పది సార్లు ఖచ్చితంగా తీసుకుంటుంది.
అంతే కానీ ఎవరు ఏది చెప్పకపోయినా ఎదో ఒకటి రాసేసి నాలుగు రాళ్ళూ వెనకేసుకోవడానికి, తమ పబ్బం గడుపుకోవడానికి వార్తలు రాయడం మీడియా కు సరి కాదు.గతం లో నయనతార మొగ కవలలకు సరోగసి పద్దతిలో జన్మ ఇచ్చినప్పుడు కోర్ట్ కన్నా ముందే శిక్షలు కూడా ఏంటో రాసేసి చివరికి నాలుక కార్చుకున్నారు.
అదేదో తమిళనాడు వార్త కాబట్టి సరిపోయింది.ఇప్పుడు మెగా కోడలు ఉపాసన హర్ట్ అవ్వకుండా చూసుకోండి మరి.







