1.తాకా ఆధ్వర్యంలో కెనడాలో క్రిస్మస్ సంబరాలు
తెలుగు అలియాన్స్ ఆఫ్ కెనడా ( తాకా ) కెనడాలోని మిస్సి సాగా నగరంలో ఉన్న కెనడియన్ కాప్టిక్ చర్చి వద్ద ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించింది.
2.లండన్ లో బి ఆర్ ఎస్ జెండా

ఎన్నారై బిఆర్ఎస్ యు కె అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
3.ఫిలిడెల్ఫియా లో ఘనంగా నాట్స్ సంబరాలు

అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఫిలడెల్ఫియా లో బాలల సంబరాలు నిర్వహించింది.ఇలా ఫిలిడెల్ఫియాలోని స్థానిక భారతీయ టెంపుల్ కల్చరల్ సెంటర్ వేదికగా ఈ బాలల సంబరాలు జరిగాయి.
4.తాల్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించింది.ఈ కార్యక్రమంలో లండన్ పరిసర ప్రాంతాల చర్చిలకు సంబంధించిన వారితో పాటు , తెలుగు ప్రజలు ఈస్ట్ లండన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
5.తానా వీల్ చైర్ క్రికెట్ పోటీలలో విజేతగా…

గత కొద్ది రోజులుగా విశాఖ గీతం ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న సౌత్ ఇండియా వీల్ చైర్ క్రికెట్ పోటీలు ముగిశాయి.ఈ పోటీలలో విన్నర్స్ గా కర్ణాటక జట్టు, రన్నర్స్ గా తమిళనాడు జట్టు నిలిచింది.
6.స్వలింగ వివాహాలకు అమెరికా ఆమోదముద్ర

అమెరికాలో వివాహాలకు సంబంధించి సరికొత్త చట్టం అమల్లోకి రానుంది.స్వలింగ వివాహాల్ని అంగీకరిస్తూ రూపొందించిన కొత్త చట్టానికి అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆమోదం తెలిపారు.
7.పన్ను సంస్కరణ చట్టానికి కొలంబియా ఆమోదం
పన్ను సంస్కరణ చట్టానికి కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో పన్ను సంస్కరణలను ఆమోదించారు.
8.బ్రిటన్ లో రైల్వే కార్మికుల సమ్మె
బ్రిటన్ లో సుమారు 40 వేల మందికి పైగా రైల్వే కార్మికులు సమ్మెబాట పట్టారు.వేతనాల పెంపు డిమాండ్ తో నాలుగు రోజులు సమ్మెకు పిలుపునిచ్చినట్లు రైల్, మారిటైమ్ ట్రాన్స్ పోర్ట్ యూనియన్ ( ఆర్ ఎం టి – కార్మిక సంఘం ) ప్రకటించింది.
9.టిక్ టాక్ పై నిషేధం దిశగా అమెరికా

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించే దిశగా అమెరికా చట్టసభలో రంగం సిద్ధమవుతోంది.అమెరికాలోని రిపబ్లికన్, డెమో క్రాటిక్ పార్టీలకు చెందిన ముగ్గురు ఎంపీలు ఒక బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టారు.
10.ధూమపానం పై న్యూజిలాండ్ జీవితకాలం నిషేధం
న్యూజిలాండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.దశల వారీగా ధూమపానాన్ని పూర్తిస్థాయిలో నిషేధించేందుకు చర్యలు చేపట్టింది.







