Kiran Abbavaram : ఇక కిరణ్ అబ్బవరం పేరు అందరు మర్చిపోవాల్సిందేనా ?

చాల మంది హీరో అవ్వాలనుకునే వారు 20 రాగానే వారి ట్రయల్స్ మొదలు పెడతారు.కానీ 26 ఏళ్ళ వయసులో సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం( kiran abbavaram ) యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ పాపులర్ అయినా కిరణ్ 2019 లో తన మొదటి సినిమా రాజా వారు రాణి గారు తో వెండి తెర అరంగేట్రం చేసాడు.

 Facts About Kiran Abbavaram-TeluguStop.com

ఈ సినిమా తర్వాత అతడి ట్యాలెంట్ చూసి ఖచ్చితంగా మంచి హేర్ అవుతాడు అని అనుకున్నారు.ఇక ఈ చిత్రం తర్వాత ఎస్ ఆర్ కల్యాణమండపం వచ్చి సైలెంట్ గా గట్టి హిట్ కొట్టింది.

దాంతో హీరోగా కిరణ్ సెటిల్ అయినట్టే అని అంతా అనుకున్నారు.

</d ఈ సినిమా తర్వాత కిరణ్ తో సినిమాలు చేయాలని చాల మంది ముందుకు వచ్చారు.కానీ ఇక్కడే అసలు కథ మొదలయ్యింది.ప్లాప్ సినిమాలు ఉన్నప్పుడు లేదా స్టార్ గా గుర్తింపు రాని వరకు ఎవరితో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

కానీ ఒక్క సాలిడ్ హిట్ కొట్టాక అందరు తననే గమనిస్తూ ఉంటారు.అలాంటి టైం లో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాలు చేయాల్సి ఉంటుంది.

</d కానీ గతి తప్పిన పరిస్థితులలో, పక్కన భజన చేసే బ్యాచ్ పెరిగితే ఇక హీరో గా ఆశలు వదులుకోవాల్సిందే.అచ్చం అలాంటి పరిస్థుతుల్లోనే ఉన్నాడు కిరణ్ అబ్బవరం.2021 లో కేవలం ఒక్క సినిమాతోనే ప్రేక్షకులను అలరించిన కిరణ్ ఆ తర్వాత 2022 లో ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కానీ ఒక్క సినిమా కూడా హిట్ టాక్ రాకపోగా కిరణ్ పని అయిపోయింది అని అంతా అనుకోవడం మొదలు పెట్టారు.

</dసెబాస్టియన్, సమ్మతమే( Sebastian ) మరియు నేను నీకు బాగా కావాల్సిన వాడిని వంటి చిత్రాలు పరాజయం పాలయ్యాయి.ఇక 2023 మొదలయి కేవలం మూడు నెలలు మాత్రమే ముగిసింది.ఈ ఫస్ట్ క్వార్ట్రర్ లో రెండవ నెలలో వినరో భాగ్యము విష్ణు కథ అనే చిత్రాన్ని విడుదల చేసిన ఎవరు దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు.ఇక అది విడుదల అయ్యి కేవలం నెల రోజులు గడవకుండానే మీటర్( Meter movie ) అనే మరొక సినిమా విడుదల చేసాడు.

ఈ చిత్రం ఘోరంగా విఫలం అయ్యింది.ఇక మీటర్ విడుదల అయినా మూడో రోజే రూల్స్ రంజన్ అనే కొత్త సినిమా అన్నౌన్స్ చేసాడు.ఇలా గ్యాప్ లేకుండా ఏది పడితే అది తీస్తూ వెళ్తే ఇక పై కిరణ్ అబ్బవరం పేరును అందరు మర్చిపోవడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube