ప్రస్తుతం కోలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో ఒక హీరోకు గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది.అతను ఎవరో కాదు 51 ఏళ్ల వయసులో హీరోగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్న అరుల్ శరవణన్ గురించి.
అరుల్ శరవణన్ హీరోగా నటించిన ది లెజెండ్ సినిమా జూలై 28వ తేదీన విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది అన్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాలో శర్వానంద్ సరసన హాట్బ్యూటీ ఊర్వశి రాథోలా హీరోయిన్ గా నటించింది.అంతేకాదు ఈ సినిమాలో భారీ తారాగణం ఉండడం గమనార్హం.
ఈ క్రమంలోనే అరుల్ శరవణన్ గురించిన అన్ని విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1.1971 సంవత్సరంలో చెన్నైలో జన్మించాడు శరవణన్.ఇక చదువు పూర్తిచేసిన వెంటనే తండ్రి లాగానే బిజినెస్ లోకి అడుగుపెట్టాడు.
2.అయితే మొదట్లో క్లాతింగ్ ఫర్నిచర్ జూవేలరీ లాంటి బిజినెస్ ను ప్రారంభించాడు.ఇక ఇవన్నీ ప్రస్తుతం వందల కోట్ల టర్నోవర్ కలిగి ఉన్నాయి అని చెప్పాలి.

3.శరవణ స్పోర్ట్స్ స్థాపించినవారిలో ఇక శరవణన్ కూడా ఒకరు అని చెప్పాలి.
4.తమిళనాడులో స్థాపించబడిన శరవణ స్పోర్ట్స్ అంటే తెలియని వారు నేటి రోజుల్లో లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.టెక్స్టైల్స్, జూవేలరీ, స్పోర్ట్స్ తో పాటు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు నగలు వంటివి కూడా ఇందులో లభిస్తాయి.
5.ఇక అందరిలాగానే చిన్నప్పటి నుంచి నటుడు అవ్వాలనే కోరిక అరుల్ శరవణన్ ఉండేదట.అయితే ఇటీవలి కాలంలో మోడల్గా సోషల్ మీడియాలో క్రేజ్ కూడా వచ్చేసింది.దీంతో నటుడిగా ఎంట్రీ ఇవ్వడానికి ఇదే సరైన సమయమని భావించాడట శరవణన్.

5.ఇక డబ్బు ఉంది కదా అని నేరుగా సినిమా మొదలు పెట్టలేదు.ముందుగా అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్నాడు.ఆ తర్వాత ది లెజెండ్ జెడ్ స్పోర్ట్స్ కంపెనీ సమర్పణలో ది లెజెండ్ చిత్రాన్ని ప్రకటించాడు అరుల్ శరవణన్.
7.అయితే ఇతను కేవలం బిజినెస్ మాత్రమే కాదండోయ్ మోడల్ కూడా తన బ్రాండ్స్ అన్నింటికీ కూడా ఇతని బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తాడు.

8.2017 లో సూర్య శ్రీ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కూడా ఉండటం గమనార్హం.
9.ప్రస్తుతం ది లెజెండ్ సినిమాకు దర్శకుడిగా ఉన్న కేడి, జెర్రీ కూడా గతంలో అజిత్ తో ఉల్లాసంగా సినిమా తీశారు.హరీస్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం అందించడం గమనార్హం.
10.తమన్నా, హన్సిక లాంటి స్టార్ హీరోయిన్లతో అరుల్ శరవణన్ రూపొందించిన వాణిజ్య ప్రకటనలు సోషల్ మీడియాలో ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయాయ్ అని చెప్పాలి.