చిరంజీవి ఆ సినిమా టికెట్ ఖరీదు.. బంగారు ఉంగరమా..?

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో చేసిన 151 సినిమాల్లో స‌క్సెస్‌ సినిమాలే ఎక్కువ‌ ఉన్నాయి.అయితే మనం ఎప్పుడు చెప్పుకోబేయేది మాత్రం 20 ఏళ్ల క్రితం నాటి మాట అని చెప్పవచు.

 Facts About Chiranjeevi Indra Movie Ticket Rates Details, Megastar Chiranjeevi,-TeluguStop.com

అప్పట్లో చిరంజీవి న‌టించిన మృగ‌రాజు సినిమా 2001లో సంక్రాంతికి కానుక‌గా భారీ బ‌డ్జెట్‌తో రిలీజ్ అయ్యి డిజాస్ట‌ర్ గా ఆగిపోయింది.అదే సమయంలో వచ్చిన న‌ర‌సింహానాయుడు మాత్రం ఇండ‌స్ట్రీ లో హిట్ నిచ్చింది.

ఆ త‌ర్వాత అదే యేడాది మే లో వచ్చిన భ‌క్తిర‌స సినిమా శ్రీ మంజునాథ యావ‌రేజ్ అయినా అంతగా పేరు రాలేదు.అదే యేడాది అక్టోబ‌ర్‌లో సురేష్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఫ్యామిలీ సినిమా గా డాడీ చేస్తే అది కూడా త‌గిన హిట్ కాలేకపోయింది.

మరి ఇప్పుడు ఎలాగైనా ఓ బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ ను అందుకుంటే త‌ప్పా త‌న కెరీర్ ముందుకు వేళ్ళదని చిరు క‌సితో ఉన్నారు.ఆ సమయంలోనే వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ బి.గోపాల్ హీరోగా చిరుతో ఇంద్రా సినిమా ఎనౌన్స్ చేశారు.రిలీజ్‌కు ముందే పాట‌లు సూప‌ర్ హిట్ అయ్యాయి.2002 జూలై 24న రిలీజ్ అయిన ఇంద్ర సినిమాకు తొలిరోజే అదిరిపోయే టాక్ వ‌చ్చింది.విడులైయినా తొలి ఆట నుంచే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ తో అస‌లు నెల రోజుల పాటు థియేట‌ర్లు కిక్కిరిసిపోయాయి.

చివ‌ర‌కు బీ , సీ సెంట‌ర్ల‌లో కూడా ఈ సినిమా వారం రోజుల పాటు రోజుకు 24 గంట‌లు ఆడుతూనే ఉంది.అంతే కాదు ప్రేక్ష‌కులు అర్ధ‌రాత్రుళ్లు కూడా సినిమా కోసం థియేట‌ర్ల ముందు పోటెత్త‌డంతో థియేట‌ర్ యాజ‌మాన్యాలు రోజుకు 7-8 షోలు కూడా ర‌న్ చేయాల్సి వచ్చింది.


అయితే ఆ రోజుల్లోనే ఇంద్ర సినిమా రు.18 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసి రు.32 కోట్ల షేర్ లను కొల్ల‌గొట్టింది.

Telugu Block Buster, Chiranjeevi, Daddy, Gopal, Gold, Indra, Mrugaraju-Movie

అంతేకాదు రు.11 కోట్ల‌కు పైగా లాభాలను నిర్మాతలకు తెచ్చిపెట్టింది.ఈ ఒక్క సినిమాతో చిరంజీవి రేంజ్ ఇండస్ట్రీలో ఆమాంతం పెరిగిపోయింది అని చెప్పవచ్చు.

ఈ సినిమా 122 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ఆడింది.అంతే కాదు ఆ రోజుల్లో ఇంద్ర సినిమా ఇండ‌స్ట్రీలో రికార్డ్‌ గా నిలిచింది.

ఈ సినిమా టిక్కెట్లు అప్ప‌ట్లో బ్లాక్‌లో కూడా విప‌రీతంగా అమ్ముడు అయ్యాయి.ఆ రోజుల్లో బ్లాక్ లో సినిమా టిక్కెట్ రు.500 అంటే వామ్మో అనేవారు.అలాంటిది ఇంద్ర సినిమా టిక్కెట్లు మాత్రం రు.1500 నుంచి రు.2 వేల వ‌ర‌కు మమ్ముఁడు పోయి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి.

Telugu Block Buster, Chiranjeevi, Daddy, Gopal, Gold, Indra, Mrugaraju-Movie

అంతే కాదు మ‌ద‌న‌ప‌ల్లిలో ఓ వ్య‌క్తి తన ఫామిలీ లోని వ్యక్తుల కోసం ఐదు టిక్కెట్ల‌ను రు.10 వేల‌ను పెట్టి కొన్నాడు.అయితే ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు బి.గోపాల్ ఓ ఇంట‌ర్వ్యూలో ఏంతో గర్వంగా తానే స్వయంగా చెప్పారు.అలాగే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా లో జంగా రెడ్డిగూడెంలోని సౌభాగ్య థియేట‌ర్లో మ‌రో వ్య‌క్తి ఓ బంగారు ఉంగ‌రం ఇచ్చి 4 టిక్కెట్ల‌ను కొన్నాడు.అయితే అప్పట్లో ఇది ఓ సంచ‌ల‌నంగా మిగిలిన వార్త.

అంతే కాదు ఇంద్ర టిక్కెట్ రేటు బంగారు ఉంగ‌రంతో స‌మానం అన్నది ఎంత హైలెట్ గా నిలిచిందో మల్లి ఇప్పటివరకు అలంటి సంచలనాలను సృష్టించిన దాఖలు లేవని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube