1945లో కైకలూరులో డిసెంబర్ మాసంలో వరప్రసాద్ జన్మించారు.ఇదే నూతన ప్రసాద్( Nutan Prasad ) అసలు పేరు.20 ఏళ్లు వచ్చే వరకు నాటకాలపై నటనపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు.చదువులు పూర్తి చేసుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకున్నారు కొన్నాళ్ల పాటు.
ఆ తర్వాత దర్శకుడు భాను ప్రకాష్ తో పరిచయమై రంగస్థలంపై మక్కువ పెంచుకున్నారు.అలా ఓ పదేళ్లపాటు నాటకాలు( Dramas ) వేస్తూనే ఉన్నారు.
ఆయన వేస్తున్న నాటకాలు ధరిస్తున్న పాత్రను చూసి నూతన ప్రసాద్ తల్లి ఎంతో ఉప్పొంగిపోయే వారట తన కొడుకు ఎప్పటికైనా పెద్ద నటుడు అవుతాడని కలలు కనే వారట.అలా నాటకాల్లో నటిస్తున్న నూతన ప్రసాద్ ని చూసి ఎవరో ఫోటోలు తీస్తే నీడ లేని ఆడది సినిమాల్లో తొలిసారిగా ఆయనకు నటించే అవకాశం వచ్చింది.
ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించిన ఎందుకో బక్కపలచగా ఉన్న నూతన ప్రసాద్ కి పెద్దగా అవకాశాలు వచ్చేవి కాదు.అయితే అతని మిత్రులు ఇచ్చిన సలహా మేరకు బీరు( Beer ) తాగితే బాగా బరువెక్కుతారు అని అలా తాగడం అలవాటు చేసుకున్నారు నూతన ప్రసాద్.ఒక్క సమయంలో ఆయన మందుకు బానిస( Alcohol Addiction ) అయిపోయారు.మందు లేకుండా ఉండలేని స్థితికి వచ్చారు మందు తాగకపోతే చేతులు వణికేవి.దాంతో ఓసారి తన జీవితం గిర్రున తిరిగినంత పని అయింది.తాగి తాగి తన బాడీని, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను అని అర్థం చేసుకొని ఓసారి అన్ని పరీక్షలు చేయించుకోవాలని అనుకున్నారు.
ఆ పరీక్షల్లో ఆరోగ్యం బాగానే ఉంది అని రిపోర్ట్స్ వస్తే తాగుడు మానేయాలని లేకపోతే ఏదైనా జబ్బు ఉంది అని తెలిస్తే తాగి తాగి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నారు నూతన ప్రసాద్.
అలా పరీక్షలు చేయించుకున్న తర్వాత అతనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని డాక్టర్ చెప్పడంతో అప్పటినుంచి మందు మానేసి తన పేరు నూతన ప్రసాద్ గా పెట్టుకొని నూతన జీవితం ప్రారంభించారు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.కానీ దురదృష్టవశాత్తు బామ్మ మాట బంగారు బాట సినిమా( Baamma Maata Bangaru Baata ) షూటింగ్ లో తన నడుము విరిగిపోయి మంచానికి పరిమితమైపోయారు.నిజానికి ఆరోజు ఉదయాన్నే అబ్బా వెన్నుపూస విరిగిపోయింది చచ్చాను రా బాబు అనే డైలాగ్ తోనే సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
పైన తధాస్తు దేవతలు తథాస్తు అన్నారో ఏమో కానీ ఆయన అన్నట్టుగానే వెన్నుపూస విరిగిపోయింది.ఇక ఆ తర్వాత వీల్ చైర్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించారు 2011లో చివరికి ఆరోగ్యం సహకరించగా కన్నుమూశారు.