తప్పు జరిగింది సారీ : ఫేస్‌బుక్ లో ఆ లోపం ఉందట !

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇప్పుడు తమ యూజర్లకు క్షమాపణలు చెబుతూ వివరణ ఇచ్చుకుంది.ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్ అప్లికేషన్ లో మార్పులు చేర్పులు చేస్తూ తమ వినియోగదారులను సరికొత్త రీతిలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

 Facebook Bug Turns On Iphone Cemera-TeluguStop.com

ఫోటోలు వీడియోలు అందరూ చూసేలా షేర్ చేసేందుకు వీలుగా ఉండడంతో ఫేస్‌బుక్ వాడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది.స్మార్ట్ ఫోన్ ఉంది అంటే చాలు అందులో ఈ అప్లికేషన్ తప్పనిసరిగా ఉంటుంది .

అయితే తాజాగా ఫేస్‌బుక్ లో ఓ చిన్న లోపం తలెత్తింది.ముఖ్యంగా ఐఫోన్ లో ఫేస్ బుక్ వాడే వారికి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఆ యాప్ లో ఉన్న ఓ ప్రైవసీ బగ్ లో లోపం కారణంగా వినియోగదారులకు చెందిన ఐ ఫోన్ కెమెరాలు ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతున్నాయి.ముఖ్యంగా యూజర్లు న్యూస్ ఫీడ్ చూస్తూ స్క్రీన్ కిందకి స్క్రోల్ చేస్తున్నప్పుడు కెమెరా ఓపెన్ అవ్వడం చాలా మంది ఈ మధ్యనే గుర్తించారు.

దీనిపై పెద్ద ఎత్తున ఫేస్‌బుక్ కు ఫిర్యాదులు కూడా వెళ్లాలి.దీనిపై విచారించిన ఫేస్‌బుక్ ఓ ప్రైవసీ బగ్ కారణంగానే ఇలా జరిగిందని, అసౌకర్యం కలిగిన అందరికీ క్షమాపణలు చెబుతున్నానని ఈ లోపాన్ని త్వరలోనే సరిచేసి అప్డేట్ చేస్తాము అంటూ వివరణ ఇచ్చుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube