ఫేస్‌బుక్ యాప్‌కి సంబంధించిన యాక్టివ్ డ్యాష్‌బోర్డ్‌కు సమయ పరిమితి ఫీచర్‌ను జోడిస్తున్నట్లు ఆ సంస్థ గతంలో ప్రకటించింది.మానసిక ఆరోగ్య నిపుణులు, ఇతర సంస్థలతో సంప్రదించి ఫేస్‌బుక్ డ్యాష్‌బోర్డ్‌కు టైమ్ లిమిట్ ఫీచర్‌ను జోడించినట్లు కంపెనీ తెలిపింది.
సోషల్ మీడియా లేకుండా, రోజువారీ జీవితాన్ని ఊహించలేం.చాలా మంది తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవుతున్నారు.
అటువంటి పరిస్థితిలో, చాలామంది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌తో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కువ సమయం గడుపుతున్నారు.
ఈ నేపధ్యంలో కొందరు వాటికి బానిసలు అయిపోతున్నారు.
దీనిని గుర్తించిన ఫేస్‌బుక్.సమయ పరిమితి ఫీచర్ ను వినియోగదారులకు అందిస్తోంది.
ఫేస్‌బుక్ సమయ పరిమితి ఫీచర్.మీరు ఫేస్‌బుక్ చూసే సగటు సమయాన్ని గమనించడం ద్వారా రోజువారీ లేదా వారానికోసారి మీకు నివేదికను అందిస్తుంది.
మీరు ఫేస్‌బుక్‌లో ఏ రోజు ఎన్ని గంటలు స్క్రోల్ చేసారో ఇది మీకు తెలియజేస్తుంది.
ఫేస్‌బుక్ యాక్టివిటీ డ్యాష్‌బోర్డ్‌లో డైలీ అలర్ట్ ఫీచర్‌ను కూడా కంపెనీ జోడించింది.
దీనిలో ఇది టైమ్ పరిమితిని సెట్ చేస్తే.మీరు ఫేస్‌బుక్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పుడు నోటిఫికేషన్‌ల ద్వారా మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది.
మీరు యాప్‌లో సెట్ చేసిన పరిమితి కంటే ఎక్కువగా చూసినప్పుడు ఫేస్‌బుక్ సమయ పరిమితి హెచ్చరిక మీకు నోటిఫికేషన్ పంపుతుంది.

సమయ పరిమితి ఫీచర్‌ని ఎలా యాక్టివేట్ చేయాలి
Android లేదా iOS స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను తెరవండి.
ఆ తర్వాత మెనూ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
క్రిందికి స్క్రోల్ చేయండి.
సెట్టింగ్‌లు గోప్యతపై క్లిక్ చేయండి.
ఇక్కడ మీకు సెలెక్ట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అందులో ప్రిఫరెన్స్ సెక్షన్‌పై క్లిక్ చేయండి.
తర్వాత సెట్ డైలీ టైమ్ రిమైండర్‌పై క్లిక్ చేసి టైమ్ సెట్ చేయండి.
ఫలితంగా మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో సమయ పరిమితి రిమైండర్ సెట్ అవుతుంది.