రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో పాటు అంతకు ముందు తెరకెక్కించిన చిత్రాలతో కూడా సక్సెస్‌లు దక్కించుకున్న దర్శకుడు అనీల్‌రావిపూడి. ఈయన ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు.
ఎఫ్ 2 సమయంలోనే ఇకపై తాను ప్రతి సంక్రాంతికి ఒక సినిమాను తీసుకు వస్తానంటూ హామీ ఇచ్చాడు.ఇంతకు ముందు మాదిరిగా సినిమాల విషయంలో అసత్వం ప్రదర్శించకుండా ఎంత పెద్ద హీరోతో అయినా కూడా ప్రతి సంక్రాంతికి సినిమాను తీసుకు వస్తానంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఆ సమయంలో అన్నట్లుగానే ఈ ఏడాది సంక్రాంతికి మహేష్‌బాబుతో తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎఫ్ 3 చిత్రాన్ని మొదలు పెట్టాడు.
తన టీంతో కలిసి ఊరు వెళ్లిన అనీల్ రావిపూడి అక్కడ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. సమ్మర్ తర్వాత షూటింగ్‌ను మొదలు పెట్టానుకున్నారు.

కేవలం మూడు నాలుగు నెలల్లో ఎఫ్ 3ని పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని భావించాడు. కాని కరోనా కారణంగా అంతా అతలా కుతలం అయ్యింది.స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నా షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభం అయ్యేనో తెలియదు.ఇక షూటింగ్స్ ప్రారంభం అయినా కూడా వరుణ్ తేజ్, వెంకీలు ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నాడు.
అవి ఎప్పుడు అయిపోతే అప్పుడు అనీల్‌రావిపూడికి డేట్లు ఇస్తారట.అవి అయిపోయేది ఎప్పుడు అనీల్‌రావిపూడికి డేట్లు ఇచ్చేది ఎప్పుడు. ఎఫ్ 3 ఈ ఏడాదిలో ప్రారంభం సాధ్యం అయ్యే పని కాదు.ఇక 2022వరకు ఈ సినిమా కోసం వెయిట్ చేయల్సి రావచ్చు.
2022 సంక్రాంతికి ఎఫ్ 3 చిత్రం వస్తుందనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి.