ప్రపంచ దేశాలకు భారత్ నుంచీ విదేశాలకు వలసలు వెళ్ళిన వారి సంఖ్య కొట్లలో ఉంటుంది.ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల కోసమో, విద్య, వ్యాపార ఇలా ఎన్నో కారణాల వలన విదేశాలకు వలసలు వెళ్తుంటారు.
ముఖ్యంగా వలస కార్మికులుగా అరబ్బు దేశాలు భారత్ నుంచీ వెళ్ళే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది.ఓ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం అరబ్బు దేశాలలో సుమారు 21 మిలియన్స్ మంది ప్రవాసులు ఉండగా అందులో భారత్ నుంచీ వెళ్ళిన వారి సంఖ్యే ఎక్కువట.
అయితే ఇప్పుడు వీరందరూ ఎవరి సొంత ప్రాంతాలకు వారు వెళ్ళిపోవాలని భావిస్తున్నారట.అందుకు రీజన్ కూడా సదరు న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
అరబ్బు దేశాలలో ఉపాది అవకాశాలు ఎక్కువే కానీ కరోనా తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక పరిస్థితులు ఎలా తల్లకిందులు అయ్యాయో అక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంది.దాంతో అరబ్బు దేశాలలో జీవన వ్యయం భారీగా పెరిగిపోయింది దాంతో స్థానిక ప్రజలు ప్రవాసులు చేసే ఉద్యోగాలు చేయాలనీ భావించడం ఆ కారణంగా ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, ఉన్న ఉద్యోగాలు పీకేయడం కూడా ఒక కారణమని వెల్లడించింది.
అంతేకాదు.
పొమ్మనలేక పొగ బెట్టినట్టుగా ప్రవాసులపై అక్కడి ప్రభుత్వాలు విధిస్తున్న ట్యాక్స్ లు చూస్తుంటే కళ్ళు గిర్రున తిరుగుతున్నాయట.
విద్యుత్ , నీటి, విద్య ఇలా అన్ని రంగాలలో ఫీజులు పెంచుకుంటూ పోతున్నారట.ముఖ్యంగా సౌదీ అరేబియాలో కుటుంబంలోని ప్రతీ వ్యక్తి నెలకు సుమారు రూ.94 వేలు చెల్లించాలట.ఒమన్, అరబ్ ఎమిరేట్స్, ప్రవాసులపై రుసుములు భారం మోపుతున్నారట.
ఆయా దేశాలలో నిత్యావసర ధరలు స్థానికులకు ఒకలా, ప్రవాసులకు ఒకలా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారట.అక్కడి స్థానిక ఉద్యోగుల జీతాలకంటే కొందరు ప్రవాస ఉద్యోగుల జీతాలు తక్కువగా ఉన్నా సరే వారికి ఈ అధిక ట్యాక్స్ లు కట్టక తప్పదని న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.