మన లక్ష్యం గొప్పదైతే ఎన్ని కష్టాలు ఎదురైనా ఏదో ఒకరోజు సక్సెస్ దక్కుతుంది.ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2018 ఫలితాల్లో ఎక్సైజ్ డీఎస్పీగా( Excise DSP ) ఉద్యోగం సాధించిన పల్లెం శ్రీనివాసులు( Pallem Srinivasulu ) సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది.
వైఎస్సార్ కడప జిల్లాలోని అడుసువారిపల్లెకు చెందిన పల్లెం శ్రీనివాసులు ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది.మారుమూల గ్రామంలో జన్మించిన శ్రీనివాసులు తల్లీదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేసేవారు.
కిరోసిన్ బుడ్డి వెలుతురులో చదువును మొదలుపెట్టిన శ్రీనివాసులు చిన్న పూరి గుడిసెలో చదువుకున్నారు.ఆ తర్వాత రోజుల్లో శ్రీనివాసులు ప్రైవేట్ స్కూల్ లో చేరగా శిథిలావస్థలో ఉన్న ఆ స్కూల్ కు వెళ్లాలంటే అతనికి భయం వేసేది.
ఆ స్కూల్ లో పదో తరగతి ఫలితాల్లో టాపర్ గా నిలిచిన శ్రీనివాసులు( Excise DSP Pallem Srinivasulu ) కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.పది పరీక్షల్లో టాపర్ గా నిలవడంతో ఇంటర్ ఉచితంగా చదివే అవకాశం శ్రీనివాసులుకు లభించింది.

ఆ తర్వాత బీటెక్ లో జాయిన్ అయిన శ్రీనివాసులు ఇంగ్లీష్ పట్ల భయంతో మధ్యలోనే బీటెక్ ఆపేశాడు.ఆ తర్వాత శ్రీనివాసులు డైట్ సెట్ రాసి టీచర్ ట్రైనింగ్( Teacher Training ) తీసుకున్నాడు.2012 డీఎస్సీ పరీక్షల్లో టాప్ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు.ఒకవైపు టీచర్ గా పని చేస్తూనే మరోవైపు డిగ్రీ పూర్తి చేసి తల్లీదండ్రుల సొంతింటి కలను శ్రీనివాసులు నిజం చేశాడు.
ఆ తర్వాత రోజుల్లో శ్రీనివాసులు గ్రూప్ 1( APPSC Group 1 ) పరీక్షపై దృష్టి పెట్టాడు.

ప్రతి సబ్జెక్ట్ కు సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని ప్రస్తుతం ఎక్సైజ్ డీఎస్పీగా శ్రీనివాసులు పని చేస్తున్నారు.భవిష్యత్తులో ఇంతకు మించి గొప్ప విజయానికి బాటలు వేసుకుంటానని శ్రీనివాసులు చెబుతున్నారు.పల్లెం శ్రీనివాసులు సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.
ఎంత ఎదిగినా సింపుల్ గా ఉంటూ శ్రీనివాసులు నెటిజన్ల మనస్సులను సైతం గెలుచుకుంటున్నారు.







