శరీరంలో ఈ భాగానికి చెమటలు.. పడితే గుండెపోటుకు సంకేతమా..?

ప్రస్తుత సమాజంలో గుండె పోటు( Heart Attack ) సమస్యలు పెరుగుతూ ఉన్నాయి.

ఎందుకంటే చెడు జీవన శైలి, కలుషిత వాతావరణం మరియు విష పూరిత ఆహారం కారణంగా గుండె సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

అలాగే గుండె పోటు అనేది ప్రాణాంతకమైన వ్యాధి అని దాదాపు చాలా మందికి తెలుసు.ముఖ్యంగా చెప్పాలంటే ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణం పోయే ప్రమాదం ఉంది.

గుండె పోటు రాక ముందే మన శరీరంలో కొన్ని తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి.సకాలంలో గుర్తించినట్లయితే వారికి చికిత్స అందించి ప్రాణాలను కాపాడవచ్చు.

అలాగే గుండె పోటు వచ్చే ముందు విపరీతంగా చెమటలు( Excessive Sweating ) పట్టడం, ఈ చెమటలను సాధారణ సమస్యగా మనం విస్మరిస్తూ ఉంటాము.

Advertisement

కానీ అది గుండె పోటుకు సంకేతం అని వైద్యులు చెబుతూ ఉన్నారు.గుండె పోటుకు ముందు శరీరంలోని అనేక భాగాల నుంచి చెమట ప్రవహిస్తుంది.అలాగే చెమటతో పాటు శ్వాస ఆడక పోవడం, అలసట, వికారం, భయం మరియు ఛాతిలో మంట లాంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా మన చంకలు మరియు వీపు విపరీతంగా చెమట పడుతుంది.కానీ గుండెపోటు సమస్య వస్తే ముఖం,( Face ) మెడ,( Neck ) నుదురు( Forehead ) మీద చెమట పడుతుంది.

అరచేతులు చల్లగా ఉండి అరచేతులు కూడా చెమటలు పడుతూ ఉంటే అది గుండె పోటుకు సంకేతం అని చెప్పవచ్చు.

ఇంకా చెప్పాలంటే గుండె పోటుకు ముందు చెమటలు పట్టడానికి శాస్త్రీయ కారణం ఉంది.చలి, వేసవి కాలం లేదా వర్షా కాలం ఏదైనా సీజన్ లలో గుండెపోటు వచ్చే ముందు చెమట వస్తుంది.మన ధమనులలో ఫలకం ఏర్పడినప్పుడు మరియు ఆక్సిజన్ గుండెకు చేరుకోలేనప్పుడు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి శరీరం చెమటను విడుదల చేస్తుంది.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

విపరీతమైన చెమట ఆయాసం వచ్చినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు.లేకపోతే ప్రాణానికే ప్రమాదం.

Advertisement

తాజా వార్తలు