బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సెక్యూరిటీ తగ్గించారు.గతంలో 3+3 గన్ మెన్లు ఉండగా ఇప్పుడు 2+2 కు కుదించారు.
అదేవిధంగా ఆయన క్యాంప్ కార్యాలయం వద్ద పైలెట్ సెక్యూరిటీని సైతం తొలగించారు.అయితే పార్టీపై గత కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్న పొంగులేటి… ఈనెల 1న ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బీఆర్ఎస్ పై పరోక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారన్న ఆయన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని తెలిపారు.







