మాజీ ఎంపీ హర్షకుమార్ మరోసారి సొంతగూటికే చేరనున్నట్లు తెలుస్తుంది.కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ హర్షకుమార్ ఆ తరువాత టీడీపీ,వైసీపీ పార్టీలలో చేరారు.
అయితే రెండు పార్టీలలో కూడా హర్షకుమార్ కు ఎలాంటి గౌరవం దక్కకపోవడం తో తిరిగి సొంత గూటికే చేరనున్నట్లు ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్ విభజన ముందు వరకు రాష్ట్రంలో చక్రం తిప్పిన నేతల్లో హర్షకుమార్ ఒకరు.
విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు.అయితే, 2019 ఎన్నికలకు ముందు హర్షకుమార్ టీడీపీలో చేరారు.
అమలాపురం ఎంపీ సీటుకోసం ప్రయత్నం చేశారు.కానీ, టీడీపీ ఆయనకు ఎంపీ సీటు ఇవ్వలేదు.
అక్కడి నుంచి హర్షకుమార్ వైసీపీలో జాయిన్ అయ్యాడు.అయితే అక్కడ కూడా ఆయనకు చేదు అనుభవం ఎదురవ్వడం తో ఆ పార్టీ నుంచి కూడా హర్షకుమార్ బయటకు వచ్చాడు.
అయితే రెండు పార్టీల నుంచి బయటకు వచ్చిన హర్షకుమార్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై పోలీసుల దాడిని ఖండిస్తూ హర్షకుమార్ వ్యాఖ్యలు చేయడంతో అయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
హాత్రాస్ ఘటనపై నిరసన తెలియజేసేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్ట్ చేయడం అన్యాయమని వ్యాఖ్యానించారు.
దళితులకు కాంగ్రెస్ హయాంలోనే న్యాయం జరిగిందని హర్షకుమార్ అన్నారు.
దళితులపై దాడులు ఆగాలంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు.తనను కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన తరువాత మళ్లీ ఆ పార్టీ దగ్గరకు వెళ్లలేదన్న హర్ష కుమార్.
పార్టీ బలోపేతం కోసం మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతున్నానని అన్నారు.అయితే తాను కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించిన హర్ష కుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం స్వాగతిస్తుందో లేదో చూడాలి.