బాపట్ల జిల్లా చీరాలలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.జనసేన ఫ్లెక్సీ లలో మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఫోటో ప్రత్యక్షం అవడంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు మొదలయ్యాయి.
ఆమంచి కృష్ణమోహన్ సోదరుడి ఆమంచి వెంకటేశ్వర్లు ఆలియాస్ స్వాములు ఫోటో జనసేన పార్టీ ఫ్లెక్సీలో ప్రత్యక్షమైంది.జనసేన సభ్యత్వాలపై వేటపాలెం మండలం పందిళ్ళపల్లిలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ లో పవన్ కల్యాణ్ తోపాటు స్వాములు ఫోటో కూడా వేసిన ఫ్లెక్సీలు రోడ్డు పక్కన కట్టారు.

దీనితో స్థానికంగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి.ఇప్పటికే ఆయన చూపు జనసేన వైపు ఉందనే పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యం ఈ ఫ్లెక్సీ లతో స్వాములు జనసేనలో చేరనున్నట్లు వినిపిస్తుంది.స్వాములు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇంఛార్జ్‌గా ఉన్న సంగతి తెలిసిందే.మరి ఏమి జరుగనుందో ఈ ఫ్లెక్సీ ఏ ఉత్కంఠకు తెరలేపనుందో చూడాలి మరి…