హైదరాబాద్ ఫిలింనగర్ ల్యాండ్ వివాదం కొత్త మలుపు తిరిగింది.నిర్మాత సురేశ్ బాబు, హీరో రానాపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
దౌర్జన్యంగా తమను ఖాళీ చేయించారని వ్యాపారి ప్రమోద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని బెదిరించారని సురేశ్ బాబుపై ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో వ్యాపారి ఫిర్యాదు మేరకు సురేశ్ బాబు, రానా సహా పలువురిపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు తెలిపింది.అదేవిధంగా విచారణకు హాజరుకావాలని కోర్టు సమన్లు అందించిందని సమాచారం.







