మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ కేసులో దర్యాప్తు వేగంగా సాగడం లేదని, ఈ క్రమంలో అధికారిని మార్చాలంటూ ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ భార్య తులసమ్మ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సీబీఐ తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.సీబీఐ స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని మండిపడిందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో విచారణ అధికారిని మార్చండి లేదా.ఇంకో అధికారిని నియమించాలని సుప్రీం కోర్టు తెలిపింది.
అనంతరం తదుపరి విచారణ ఈనెల 29కు వాయిదా వేసింది.అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై తెలంగాణలో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.