మాజీ మంత్రి కి బెయిల్ మంజూరు

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కు బెయిల్ మంజూరు అయినట్లు తెలుస్తుంది.

ఒక హత్యకేసులో ఏ 4 నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్ర కు మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ నేడు తీర్పు వెల్లడించింది.

ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు లో శిక్ష అనుభవిస్తుండగా ఆయన బెయిల్ కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు.దీనితో మచిలీపట్టణం కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసినట్లు తెలుస్తుంది.28 రోజులు విజయవాడలోనే ఉండాలి అని, సెల్ఫ్ క్వారంటైన్ లోనే ఉండాలి, నలుగురితో కలవకూడదు ఇలా మొత్తం దాదాపు ఒక 15 షరతులు విధించి మరీ కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తుంది.మోకా భాస్కర్ రావు హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్ర రాజమండ్రి జైలు లోనే ఉంటున్నారు.

అయితే తాజాగా ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడం తో రేపు రాజమండ్రి జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తుంది.వైసీపీ నేత మోకా భాస్కర్ రావు ను ఇద్దరు యువకులు బందరు మార్కెట్ లో దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.

అయితే వైసీపీ నేత పేర్ని నాని కి మోకా ముఖ్య అనుచరుడు కావడం తో అతడి హత్య కేసు విచారణను వైసీపీ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది.అయితే ఈ కేసులో ముఖ్యులు అయిన ఆ ఇద్దరు యువకులను సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేయగా, విచారణలో చిన్నా అనే టీడీపీ నేత పేరు వినిపించింది.

Advertisement

అయితే 2013 లో సంపత్ హత్య జరిగిన దానికి ప్రతీకారం గానే మోకా భాస్కర్ రావు ను దారుణంగా హతమార్చినట్లు వెల్లడైంది.అయితే టీడీపీ నేత చిన్నా పేరు వినిపించడం తో అతడిని కూడా అదుపులోకి తీసుకొని విచారించగా కొల్లు రవీంద్ర పేరు వినిపించింది.

దీనితో జులై లో పోలీసులు కొల్లు రవీంద్ర ను అరెస్ట్ చేసి ఈ హత్య కేసులో ఏ4 నిందితుడిగా చేర్చారు.గత కొద్దీ రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలు లోనే జైలు శిక్ష అనుభవిస్తున్న కొల్లు రవీంద్ర కు మచిలీపట్నం కోర్టు తాజాగా షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు