అజేయ కల్లంపై మాజీమంత్రి దేవినేని ఉమ ఫైర్

మాజీ సీఎస్ అజేయ కల్లంపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  అజేయ కల్లం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంపై తెల్లవారుజామున జగన్ వచ్చి చెప్పారని అన్నారని తెలిపారు.కానీ ఇప్పుడు ఏమో సమయం తెలియదు చూసుకోలేదని సీబీఐకి చెప్తారా అని దేవినేని ప్రశ్నించారు.

మీలాంటి మేధావులు ఉండబట్టే జగన్ దోచుకుంటున్నారని ఆరోపించారు.కేవలం కుల పిచ్చితో జగన్ పక్కన అజేయ కల్లం చేరారని విమర్శించారు.

అమరావతిపై విషం చిమ్మిన నలుగురిలో ఒకరు బయటకు వచ్చారన్న ఆయన వారిని సీబీఐ బొక్కలో వేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement
ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?

తాజా వార్తలు