కాంగ్రెస్ చ‌రిత్ర‌ను అప‌హాస్యం చేసిన‌ట్లేః మాజీమంత్రి ఆనంద్ శ‌ర్మ‌

కాంగ్రెస్ పార్టీ విధానంపై ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు బ‌హిరంగంగానే ప‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే కేంద్ర మాజీమంత్రి ఆనంద్ శ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఎందుకు ఎప్పుడూ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల గురించే మాట్లాడ‌తారు.? కాంగ్రెస్ ఆ రెండు పేర్ల‌కే ప‌రిమితం అయిందా.? అని ప్రశ్నించారు.ఇది కాంగ్రెస్ పార్టీ చ‌రిత్ర‌ను అప‌హాస్యం చేసిన‌ట్టు అవుతుంది కదా అని అడిగారు.

కాంగ్రెస్ అంటే ఇద్ద‌రిదే కాదన్న ఆయ‌న‌.పార్టీలో మొద‌టి నుంచి ఉన్న త‌మ‌లాంటి వాళ్లంద‌రిది అని స్ప‌ష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో స‌మూల ప్ర‌క్షాళ‌న జ‌ర‌గాల‌ని 23 మంది సీనియ‌ర్లు రెండేళ్ల క్రిత‌మే సోనియా గాంధీకి లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే.ఇందులో ఆనంద్ శ‌ర్మ కూడా ఒక‌రు.

Advertisement

ఇటీవ‌లే ఆయ‌న హిమాచ‌ల్ ప్ర‌దేశ్ స్టీరింగ్ క‌మిటీ చీఫ్ ప‌దవికి రాజీనామా చేశారు.అయినా, తాను జీవిత‌కాలం కాంగ్రెస్ వ్య‌క్తిగానే ఉంటాన‌ని తెలిపారు.

ఆత్మ‌గౌర‌వాన్ని చంపుకోలేక ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్టు తెలిపారు.ఈ క్ర‌మంలో త‌న రాజీనామాకు గ‌ల కార‌ణం సోనియాగాంధీకి అర్థ‌మ‌య్యే ఉంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు