టీడీపీ లోకే ' కన్నా ' ! చేరేది ఎప్పుడంటే ?

బిజెపి ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు.

ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు తో విభేదాలు పెరగడంతోపాటు, ఏపీలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం , తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీ మారాలనే ఆలోచనకు ఆయన వచ్చారు.

జనసేన లో చేరుతారనే ప్రచారం జరిగినా,  చివరకు ఆయన టిడిపిలోకి వెళ్లేందుకే నిర్ణయించుకున్నారు.ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రావడంతో పాటు , పార్టీలోనూ తగిన ప్రాధాన్యం కల్పిస్తామని భరోసా ఇవ్వడంతో కన్నా టిడిపి కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.

ఈరోజు తన ముఖ్య అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన ఆయన ఏ పార్టీలో చేరాలని అంశంపై తన అనుచరుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మెజార్టీ అనుచరులు  టిడిపిలోకి వెళ్తేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో కన్నా ఫైనల్ గా టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు.

అయితే నందమూరి కుటుంబానికి చెందిన తారకరత్న మరణించడంతో సమావేశ వివరాలు బహిరంగంగా వెల్లడించడం లేదట.ముందుగా జనసేన లో చేరాలని కన్నా చూసినా.పవన్ ఆయనను చేర్చుకునేందుకు ఆసక్తి చూపించలేదట.

Advertisement

దీనికి కారణం ప్రస్తుతం జనసేన బీజేపీలు పొత్తు కొనసాగిస్తున్న సమయంలో బిజెపి నుంచి జనసేనలోకి చేరికలు ప్రోత్సహిస్తే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సివస్తుందనే  అభిప్రాయంతో పవన్ కన్నా చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట .దీంతో ఆయన టిడిపిలో చేరుతున్నారు.

రాబోయే రోజుల్లో ఎలాగూ జనసేన , టిడిపి పొత్తు పెట్టుకునే ఆలోచనతో ఉండడంతో , తన గెలుపుకు ఎటువంటి డోఖా ఉండదనే అంచనాలో ఆయన ఉన్నారట.ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో  ఆయన ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.2024 ఎన్నికల్లో ఆయనకు సత్తెనపల్లి టికెట్  ఇచ్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు