హైదరాబాద్ లో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది.ఈ మేరకు రేపు, ఎల్లుండి హోటల్ తాజ్ కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహించనున్నారు.
సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యే సభ్యుల కోసం తాజ్ డెక్కన్, తాజ్ బంజారాలలో బస ఏర్పాట్లు చేశారు.రెండు రోజుల సమావేశాల అనంతరం రంగారెడ్డి జిల్లా తుక్కగూడలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.17న సీడబ్ల్యూసీ మీటింగ్ ముగిసిన అనంతరం బహిరంగ సభకు హాజరుకానున్నారు.కాగా సభా వేదికపై నుంచి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఐదు గ్యారెంటీ పథకాలను ప్రకటించనున్నారు.
ఈ క్రమంలో సీడబ్ల్యూసీ సమావేశాలతో పాటు తుక్కగూడలో సభ కోసం ఇప్పటికే తెలంగాణ పీసీసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.







