అమెరికాలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని తెలుగు యువతి జాహ్నవి కందుల( Jahnavi Kandula ) మరణించిన సంగతి తెలిసిందే.కుటుంబంలో తీవ్ర విషాదానికి కారణమైన ఈ ఘటనపై సానుభూతి చూపించాల్సిందిపోయి జాహ్నవి మరణంపై ఓ పోలీస్ అధికారి జోకులు వేశాడు.
అతని వైఖరి భారత్, అమెరికాలలో తీవ్ర దుమారం రేపుతోంది.ఆమె మరణంపై సదరు పోలీస్ అధికారి జోకులు వేసుకుంటూ , నవ్వుతూ మాట్లాడిన దృశ్యాలు అతని శరీరానికి అమర్చిన బాడీ కామ్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
తాజాగా అవి వెలుగులోకి రావడంతో జాహ్నవి కుటుంబ సభ్యులు, మిత్రులతో పాటు భారత ప్రభుత్వం, భారత్‌లోని రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం అమెరికాను కోరింది.
తాజాగా భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి( Raja Krishnamurthy ) సైతం ఈ ఘటనపై స్పందించారు.జాహ్నవి మరణంపై సీరియస్‌గా దర్యాప్తు చేయాలని ఆయన సీటెల్ పోలీస్ శాఖను కోరారు.
ఆమె మరణం ఓ భయంకరమైన విషాదమన్న ఆయన.జాహ్నవి మరణాన్ని ఎవ్వరూ తక్కువ చేయడం, ఎగతాళి చేయడం సరికాదన్నారు.

కాగా.నార్త్ ఈస్ట్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరిగ్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో జాహ్నవి మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుతోంది.ఈ క్రమంలో జనవరి 23న జాహ్నవి రోడ్డు దాటుతుండగా పోలీస్ వాహనం దూసుకొచ్చి ఆమెను ఢీకొట్టింది.ఈ సమయంలో వాహనంలో సీటెల్ పోలీస్ విభాగానికి చెందిన కెవిన్ డేవ్ ( Kevin Dave )వున్నాడు.
అతని బాడీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి.కెవిన్ స్పీడో మీటర్ గంటకు 74 మైళ్ల వేగాన్ని చూపుతోంది.ఫాక్స్ సీటెల్ వార్తా సంస్థ కథనం ప్రకారం.జాహ్నవిని డెక్స్‌టర్ అవెన్యూ నార్త్ , థామస్ స్ట్రీట్ కూడలి వద్ద కారు ఢీకొట్టింది.
తీవ్ర గాయాలైన ఆమెను స్థానికులు, పోలీస్ అధికారులు హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల 2021లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి.సీటెల్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చేరారు.జనవరి 23న కళాశాలకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆమె మరణవార్తతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.జాహ్నవి భౌతికకాయాన్ని భారతదేశానికి తరలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘‘తానా’’ అండగా నిలిచింది.
జనవరి 29న ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో మృతదేహాన్ని హైదరాబాద్‌కు అక్కడి నుంచి ఆదోనీకి పంపారు.అలాగే జాహ్నవి కుటుంబానికి అండగా నిలిచేందుకు గాను ఆమె స్నేహితులు ‘‘గో ఫండ్ మీ’’ ద్వారా నిధుల సమీకరణ చేపట్టారు.







