70 టన్నుల బరువు కలిగిన డైనోసార్లను ఎపుడైనా చూశారా?

Ever Seen Dinosaurs That Weighed 70 Tons 70tunes, Dianosiur, Viral Latest, News Viral, Social Media, Viral, Photos, China , 15 Miters

డైనోసార్స్( Dianosiur ) 70 టన్నుల బరువు కలిగి ఉండడమే? అదంతా అబద్ధం అని అనిపిస్తోంది కదూ.ఆగండాగండి.

 Ever Seen Dinosaurs That Weighed 70 Tons 70tunes, Dianosiur, Viral Latest, News-TeluguStop.com

ఈ కధనం పూర్తిగా చదివినాక మీ నిర్ణయం ఏమిటో ఒకసారి చెప్పండి జరా.తూర్పు ఆసియాలో 160 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు ఉండేవట.వీటికి పోటీగా పొడవాడి మెడ కలిగిన జంతువులు కూడా ఉండేవని మనకు దాదాపుగా తెలియదు.ఆ పొడవాటి మెడ ఉన్న జంతువు తాలూకు మెడ, పుర్రె శిలాజాలు బయటపడడంతో మమెంచి సారస్ సినోకానడోరం అనే డైనోసార్ జాతి జంతువులు కూడా ఉండేవని బయటపడింది.

కాగా వీటి మెడ 15 మీటర్ల పొడవు.

అంటే జిరాఫీ మీదకన్నా చాలా రెట్లు పెద్దది.వాయువ్య చైనా( China ) లోని జింజియాంగ్ యువిఘుర్ అటానమస్ రీజియన్‌లో 160 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి రాళ్ల నుంచి ఈ శిలాజాలు 1987లో బయట పడ్డాయని సమాచారం.అయితే ఈ జంతువు పూర్తి మెడ పొడవును ఇటీవలనే శాస్త్రవేత్తలు సమీక్షించారు.

ఈ డైనోసార్ శాకాహార సౌరోపాడ్ తెగకు చెందినది.అంటే పొడవైన మెడ, తోక, చిన్న తల, భారీ అవయవాలతో కూడిన పెద్ద చతుర్భుజ శాకాహార డైనోసార్ అన్నమాట.

ఇక అవి ముట్టి నుంచి తోక వరకు 50 మీటర్ల పొడవు కలిగి ఉంటాయట.ఇక వాటి బరువు విషయానికొస్తే 70 టన్నులకు మించి ఉంటుంది అని చెబుతున్నారు.

ఇక వీటి జీవన మనుగడ విషయానికొస్తే, ఇవి ఒకే చోట ఉండి, ఎక్కువగా ఎలాంటి చలనం లేకుండా ఉండేవని అంటున్నారు.అంటే ఎలాంటి శక్తిని వెచ్చించకుండా టన్నుల కొద్ది శాకాహారాన్ని తీసుకునేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అయితే ఇంత భారీ శరీరంతో కుప్పకూలిపోకుండా ఇవి ఎలా నిలబడగలిగేవో శాస్త్రవేత్తలకు మాత్రం ఇపుడు అంతుచిక్కడం లేదు.కానీ ఎక్స్‌రే స్కానింగ్ తీసి విశ్లేషించగా, వీటి వెన్నుముక తేలికపాటి గుల్ల బారి ఉంటుందని బయటపడింది.

శరీరంలో ఎముకల్లో గాలి ఖాళీలు చాలా ఉన్నాయని, అవే తేలికబరుస్తున్నాయని తేలింది.

Video : 70tunes,dianosiur, Viral Latest, News Viral, Social Media, Viral, Photos, 15 Miters #TeluguStopVideo

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube