తమిళ సినీ ఇండస్ట్రీలో వరుసగా సూపర్ స్టార్ హీరోలతో నటించిన ముద్దుగుమ్మ మాళవిక మోహనన్.ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్ కి జోడిగా మారుతి దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.రెండవ షెడ్యూల్ చిత్రీకరణ లో ప్రభాస్ తో కలిసి మాళవిక మోహనన్ పాల్గొంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

మారుతి దర్శకత్వం లో సినిమా కు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు.అయినా కూడా ప్రభాస్ కి జోడిగా మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు క్లారిటీగా వార్తలు వస్తున్నాయి.ఆ మధ్య తాను తెలుగు లో ఒక పెద్ద హీరో తో కలిసి నటిస్తున్నట్లుగా కూడా పేర్కొంది.అది ఎవరో కాదు ప్రభాస్ అని సోషల్ మీడియా లో కూడా ప్రచారం జరిగింది.
ఇంతగా కోలీవుడ్ లో సినిమా లు చేస్తున్నా కూడా తెలుగు లో ఈమెని పట్టించుకుంటున్న నాథుడు లేడు అనే ఆవేదన కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ వంటి స్టార్ హీరో తో సినిమా చేస్తున్నప్పటికీ కూడా ఇతర తెలుగు ఫిలిం మేకర్స్ ఈమెను పట్టించుకోవడం లేదు.ప్రభాస్ సినిమా వచ్చిన తర్వాత మాత్రమే ఈమెతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ వెయిట్ చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.మొత్తానికి టాలీవుడ్ లో ఈ అమ్మడు ప్రభాస్ సినిమా తో ఎంట్రీ ఇవ్వబోతుంది.
ఆ తర్వాత ఎలా ఈ అమ్మడి యొక్క కెరియర్ ఉంటుందా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తమిళం లో సూపర్ స్టార్ మూవీ మాస్టర్ సినిమా లో నటించి సూపర్ హిట్ సొంతం చేసుకున్న తర్వాత ధనుష్ తో కలిసి ఒక సినిమా లో నటించింది.
ఇంకా మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది.సౌత్ ఇండియన్ సినిమాల్లో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమా లపై కూడా ఈ అమ్మడి ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం అందుతుంది.







