రాజకీయాల్లో ఓపిక అవసరమని, ఎంత ఓపిక పడితే అంత మంచి జరుగుతుందని, చిల్లర వ్యక్తులు కవ్వించినా సమన్వయం పాటించాలని, చిల్లర వ్యక్తుల సంగతి పార్టీ చూసుకుంటుందని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఎవరు భయపడవద్దు పదేపదే తన అనుచరులకు హితబోధ చేస్తూ ఉంటారు.సీనియర్ పొలిటిషన్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు.
కానీ ఆ ఓపిక , సహనం తన ప్రధాన అనుచరుడి హత్య కు పరోక్ష కారణం అయ్యింది.
ఒకప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఏకచిత్రాధిపత్యం గా తుమ్మల హవా నడిచేది.
రాష్ట్రవ్యాప్తంగా ఆయన కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు.ముఖ్యంగా టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తుమ్మలకు ఆ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించారు.
అయితే క్రమ క్ర మంగా టిఆర్ఎస్ లో తుమ్మల ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది.అప్పుడప్పుడు ఆయన పాలేరు నియోజకవర్గంలో పర్యటిస్తూ జనాలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నా, ఏదో తెలియని అసంతృప్తి.
ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరిన కందాల ఉపేందర్ రెడ్డితో తుమ్మల నాగేశ్వరరావుకు సఖ్యత లేకపోవడం, ఉపేందర్ రెడ్డి వర్గం పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తూ తుమ్మల అనుచరులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతుండడం, తదితర కారణాలతో తుమ్మల నాగేశ్వరావు చాలా కాలంగా టీఆర్ఎస్ పై అసంతృప్తితోనే ఉన్నారు.చాలా కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు తుమ్మల ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య హత్య వరకు వెళ్లడం తుమ్మల వర్గీయుల్లో ఆందోళన పెంచుతోంది.
చాలా కాలంగా టిఆర్ఎస్ లో ప్రాధాన్యం దక్కకుండా తీవ్ర అసంతృప్తితో ఉంటూ , సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాను అంటూ తుమ్మల పదేపదే చెబుతున్నా, ఆయన టిఆర్ఎస్ అగ్ర నేతల నుంచి సరైన హామీ , ప్రాధాన్యం పొందలేకపోవడం అదే సమయంలో తుమ్మల ప్రత్యర్థి వర్గంగా ఉన్న ఎమ్మెల్యే కందాలా ఉపేందర్ రెడ్డి వర్గం పై చేయి సాధిస్తూ వస్తుండడం వంటివి తుమ్మల ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ వస్తుండడం వంటివి చోటుచేసుకుంటూ వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఆయన బిజెపిలో చేరతారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న, ఆయన పార్టీ మారే విషయంలో నాన్చుడు ధోరణి ని అవలంబిస్తూ వస్తుండడంతో దానికి తుమ్మల అనుచరులు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

పాలేరు నియోజకవర్గంలో ఏడాదికాలంగా టిఆర్ఎస్ లో వర్గ ఘర్షణలు పెరిగిపోయాయి.ఇప్పుడు ఖమ్మం రూరల్ మండలం తెల్దారు పల్లి గ్రామానికి చెందిన తుమ్మల నాగేశ్వరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య ను అతి కిరాతకంగా హత్య చేసే వరకు వ్యవహారం వెళ్ళింది.అయితే ఈ హత్య ఆధిపత్య పోరు కారణంగానే జరిగినా , తెల్దారు పల్లి కి చెందిన కీలక నాయకుల హస్తం ఉన్నా, వారికి టిఆర్ఎస్ లోని తుమ్మల వ్యతిరేక వర్గం పూర్తిగా సహకారం అందించడంతోనే ఇంతవరకు వ్యవహారం వెళ్లిందనే చర్చ జరుగుతోంది.చాలా కాలంగా తుమ్మల నాగేశ్వరావు అనుచరులకు ప్రభుత్వ కార్యాలయాలు వద్ద పనులేమీ జరగకుండా ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంటున్నా, పోలీస్ స్టేషన్ లో తుమ్మల అనుచరులకు వరుసగా కేసులు నమోదు అవుతున్న, తుమ్మల సీరియస్ గా తీసుకోకపోవడం, తుమ్మల నాగేశ్వరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య ను టార్గెట్ చేసుకుంటూ గత కొంతకాలంగా టిఆర్ఎస్ లోని ఓ వర్గం ఇబ్బందులకు గురి చేస్తున్నా, కొంతకాలం క్రితం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన మైబు అనే తమ్మినేని కృష్ణయ్య అనుచరుడిపై దాడి జరిగినా, తుమ్మల సీరియస్ తీసుకోకపోవడం తను అనుసరులపై వేధింపులు, కక్షసాధింపులు చోటు చేసుకుంటున్నా టిఆర్ఎస్ అగ్ర నేతలు వద్ద ఈ వ్యవహారాలను ప్రస్తావించి సరైన రాజకీయ ప్రాధాన్యం సంపాదించడంలో తుమ్మల వెనుకబడి పోవడమే ఆయన అనుసరులకు శాపంగా మారింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇక టిఆర్ఎస్ అగ్రనేతల సైతం తుమ్మల విషయంలో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తూ కందాల ఉపేందర్ రెడ్డి వర్గాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నా, తుమ్మల ఇప్పటికీ నాన్చుడి ధోరణినే అవలంబిస్తూ వస్తుండడం తుమ్మల అనుచరులలోనూ తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది.