తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గవర్నర్( Telangana governor ) తీరును తప్పుపడుతూ బీఆర్ఎస్ నాయకులు అనేక సందర్భంలో విమర్శలు చేశారు.
అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపడుతూ గవర్నర్ సైతం అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు.ఇక చాలాకాలంగా ప్రగతి భవన్, గవర్నర్ కార్యాలయం మధ్య ఈ వివాదం కొనసాగుతూనే ఉండగా, అసలు దేశానికి గవర్నర్ వ్యవస్థ అవసరమా అంటూ ఈ మధ్యనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ( KTR )సైతం వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపిక విషయమై మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ కి మధ్య వివాదం జరుగుతుంది .తెలంగాణ గవర్నర్ తమిళ సై( Tamilisai Soundararajan ) విషయంలో కెసిఆర్ సీరియస్ గా ఉన్నారు.తాజాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపికపై క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ వెనక్కి పంపారు.దీనిపై గవర్నర్ తీరుపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టు ను తెలంగాణ ప్రభుత్వం పంపగా, గవర్నర్ దానిని తిరస్కరించడంతో మళ్లీ ఆ అభ్యర్థుల జాబితాలో ఉన్నవారిని గవర్నర్ కోటాలో మండలి కి పంపాలని కెసిఆర్ పట్టుదలగా ఉన్నారు.శుక్రవారం జరగనున్న క్యాబినెట్ బేటిలో దాసోజు శ్రావణ్ కుర్రా సత్యనారాయణ( Kurra Satyanarayana ) పేర్లను మరోసారి క్యాబినెట్ ద్వారా సిఫార్సు చేయనున్నారు.

.వీరిద్దరిపై ఎలాంటి కేసులు లేవు .రాజకీయ నేతలు అయినా దాసోజు శ్రావణ్( Dasoju Sravan Kumar ) ప్రొఫెసర్ అని కుర్ర సత్యనారాయణ కార్మిక వర్గాల నేతలు చెబుతున్నారు.వారిద్దరూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక అయ్యేందుకు అర్హతలు ఉన్నాయని చెబుతున్నారు.
ఏదైనా ఫైల్ గవర్నర్ తిరస్కరించినప్పుడు అదే ఫైల్ నుంచి రెండోసారి పంపితే కచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుందని చెబుతున్నారు.గవర్నర్ కి ఉన్న అధికారాలు పరిమితమైనవి .ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తిరస్కరించేందుకు అవకాశం ఉంది.కానీ అది ఒక్కసారి మాత్రమే చేయడానికి అవకాశం ఉంది.
రెండోసారి తిరిగి పంపితే ఆమోదించాల్సి ఉంటుంది.దీంతో మరోసారి ఆ ఇద్దరి అభ్యర్థులు లిస్టును గవర్నర్ కార్యాలయానికి పంపితే కచ్చితంగా గవర్నర్ ఆమోదిస్తారని లెక్కలు కేసీఆర్ ( CM kcr )వేసుకుంటున్నారు.
మరి ఈ విషయంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.







