టీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే ప‌ద‌వి రాజీనామాకు కుదిరిన మూహుర్తం.. ఎప్పుడంటే.. ?

కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్న సమయంలో రాజకీయం సృష్టించిన భూ క‌బ్జా అనే వైరస్ బారిన పడిన ఈట‌ల రాజేంద‌ర్, కరోనా నుండి తప్పించుకున్నారే గానీ, తెలంగాణలో నడుస్తున్న రాజకీయాలకు బలైయ్యాడని ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నారట.

 Telangana, Etela Rajendar, Resign, Mla Post, Tomorrow,laets News-TeluguStop.com

ఇక రాష్ట్ర రాజకీయాల్లో ఈట‌ల రాజేంద‌ర్ పై వచ్చిన భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ ఆరోప‌ణ‌లతో ఈట‌ల రాజేంద‌ర్ మంత్రి ప‌ద‌వి పోవడమే కాకుండా ఆయన రాజకీయ భవిష్యత్తును ఆలోచనలో పడవేసింది.ఇలా ఊహించని విధంగా తెలంగాణ దొరల రాజకీయం చిక్కులు తెస్తుందని అనుకోని రాజేందర్ ఎన్నో తర్జభర్జనల తర్వాత బీజేపీ వైపు చూపు సారించారు.

చివరికి తనకు తగినంత ప్రాధాన్య‌త బీజేపీలో దక్కాలనే హమీతో, నమ్మకం కలిగాక కమళంలో చేరేందుకు సిద్దం అయ్యారు.ఈ నేపధ్యంలో తన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామాకు మూహుర్తం కుదుర్చుకున్నారట.

కాగా జూన్ 4వ తేదీ అంటే శుక్రవారం రోజు ఈటల ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నట్లుగా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube