బీజేపీ లో ' ఈటెల ' ట్రబుల్స్ ? ఎవరికీ చెప్పుకోలేక..?

గత కొన్ని రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ఈటెల రాజేందర్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై హైదరాబాదులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

దీంతో పాదయాత్ర ను మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది స్పష్టత లేదు.

అసలు మళ్లీ ప్రారంభిస్తారా లేదా అనేది అనుమానంగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది.దీనికి కారణం బిజేపి లో రాజేందర్ కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడం, గ్రూపు రాజకీయాలు కారణంగా తాను ఒంటరిగానే మిగిలిపోయినట్లుగా రాజేందర్ భావిస్తున్నారు.

వాస్తవంగా తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వత టిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజేందర్ రాజీనామా చేశారు.అప్పుడే ఆయన సొంత పార్టీ పెడుతున్నారనే ప్రచారం జరిగినా, చివరకు బిజెపిలో చేరారు.

అప్పటి కే రెండు గ్రూపులుగా ఉన్న తెలంగాణ బీజేపీ లో రాజేందర్ చేరికతో మూడో గ్రూపు తయారయింది అనే అభిప్రాయానికి వచ్చినట్టుగా భావించి ఈటెలను పక్కన పెట్టినట్లుగా వ్యవహరించారు.హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారం నిర్వహించినా, పాదయాత్ర నిర్వహించినా, ఈటెల వర్గం మాత్రమే హాజరయ్యేది.

Advertisement

బిజెపి శ్రేణులు పెద్దగా  ఈటెల రాజేందర్ కు సపోర్ట్ చేయక పోవడం తదితర కారణాలతో రాజేందర్ లోనూ అసంతృప్తి చెలరేగింది.ఇక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్ కావడం, కర్ణాటక రాజకీయాల్లో బిజీగా  ఉండడం, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సైతం హుజూరాబాద్ నియోజకవర్గం పై పెద్దగా దృష్టి సారించకపోవడం, ఇలా ఎన్నో కారణాలతో తాను బీజేపీలో ఒంటరి వాడినే అనే అభిప్రాయం రాజేందర్ కు వచ్చేసిందట.

దీనికి తోడు కేంద్ర బిజెపి పెద్దలు సైతం మొదట్లో ఇచ్చినంత ప్రాధాన్యత ఇప్పుడు ఇవ్వడం లేదని, ఉప ఎన్నికలను నిర్వహించే విషయంలోనూ పెద్దగా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తుండడం, హుజూరాబాద్ నియోజకవర్గంలోని బీజేపీ శ్రేణులు సైతం తనను పట్టించుకోనట్లుగా వ్యవహరించడం ఇలా ఎన్నో కారణాలతో రాజేంద్ర తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్లు సమాచారం.ఈ కారణాలతోనే ఆయన తన పాదయాత్రను అనారోగ్యం కారణాలు చూపించి వాయిదా వేశారనే టాక్ నడుస్తోంది.

Advertisement

తాజా వార్తలు