ఈటెలకు టీ బీజేపీ బాధ్యతలు అప్పగిస్తే పరిస్థితి ఏంటి?

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ( BJP ) అధికారంలోకి రావడం ఖాయం.కాంగ్రెస్( Congress ) కి ప్రత్యామ్నాయం మేము.

బీఆర్‌ఎస్ ను ఎదురించి నిలిచేది మేమే అంటూ బీజేపీ నాయకులు చాలా గట్టిగా మాట్లాడుతున్న విషయం తెల్సిందే.బీఆర్ఎస్ ను ఓడించే సత్తా మాకు మాత్రమే ఉంది అంటూ బీజేపీ నాయకులు చేస్తున్న మాటలతో తెలంగాణ రాజకీయం మారుతుందా అన్నట్లుగా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఒక వైపు బీఆర్‌ఎస్‌ ను ఓడించి తాము అధికారాన్ని దక్కించుకుంటాం అంటూ రేవంత్ రెడ్డి ( Revanth Reddy )చాలా బలంగా ధీమాతో ఉన్నారు.

ఇలాంటి సమయంలో తెలంగాణ బీజేపీ లో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది.ముఖ్య నాయకుల మధ్య సఖ్యత లేదు అంటూ పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది.దాంతో బీఆర్‌ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు బీజేపీని తీవ్రంగా టార్గెట్‌ చేస్తున్నారు.

Advertisement

తాజాగా ఈటెల రాజేందర్‌( Etela Rajender ) ఢిల్లీ వెళ్లాడు.అక్కడ బీజేపీ ముఖ్య నేతలతో మాట్లాడుతున్నాడు.

బీఆర్‌ఎస్( BRS ) వారు మాట్లాడుకుంటున్న విషయం ఏంటి అంటే బీఆర్‌ఎస్ ను దెబ్బ కొట్టేందుకు గాను బండి సంజయ్‌ ను తప్పించి ఈటెలకు ఆ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారట.

అదే కనుక జరిగితే బండి సంజయ్( Bandi Sanjay ) ఊరికే ఉండడు.ఆయన తీవ్రంగా పార్టీకి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తెలంగాణ లో అద్భుతమైన ఫలితాలు నమోదు అయ్యాయి.ఆయన చాలా అగ్రెసివ్‌ గా ఉంటూ బీఆర్‌ఎస్ పార్టీకి చుక్కలు చూపిస్తాను అంటూ చాలా సీరియస్ గా మాట్లాడటం జరుగుతుంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఆయన మాటలు అప్పుడప్పుడు వివాదాలను కలుగ జేశాయి.దాంతో పార్టీకి మంచి బూస్ట్ దక్కింది.

Advertisement

అయితే అంతకు మించి ముందుకు వెళ్లాలి అంటే ఈటెల వంటి సీనియర్ లు ఉండాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.కనుక అతి త్వరలోనే కీలక మార్పు ఉంటుందేమో అంటున్నారు.

తాజా వార్తలు