బీజేపీ తెలంగాణలో గెలవాలంటే ఇంకా శక్తి కావాలని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.బీజేపీ అధ్యక్షుడు బాగానే పని చేస్తున్నారని తెలిపారు.
పార్టీ అధ్యక్షుడు మార్పు విషయంలో గతంలోనే వార్తలు వచ్చాయని ఈటల అన్నారు.అయితే ఎన్నికల సమయంలో మార్పులు ఉండకపోవచ్చని తెలిపారు.
అదేవిధంగా తనను ఎలా వాడుకోవాలో అధిష్టానం చూసుకుంటుందని పేర్కొన్నారు.పార్టీలో పాత, కొత్త వారికి ఘర్షణ వాతావరణం సహజమని చెప్పారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు మాజీ మంత్రి జూపల్లిని పార్టీలోకి రావాలని కోరామన్నారు.అందుకు వారు కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారని వెల్లడించారు.