ఈ ఏడాది సెంచరి కొట్టడం ఖాయమట

దేశంలో పెట్రోల్‌ రేట్లు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దశాబ్ద కాలంలో పెట్రోల్‌ రేట్లు ఏకంగా 500 రెట్లు పెరిగాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఈ ఏడాది పెట్రోల్‌ రేటు సెంచరీకి చేరడం కన్ఫర్మ్‌ అంటూ మార్కెట్‌ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం పెట్రోల్‌ రెట్లను నష్టాలు వస్తున్నా పెంచడం లేదని, త్వరలోనే నష్టాల భర్తీకి భారీగా పెంచాల్సిన పరిస్థితి వస్తుందని, అలాగే బంక్‌ల నిర్వహణ కోసం డీలర్లకు కమీషన్‌ కూడా పెంచే యోచనలో కంపెనీలు ఉన్నాయి.

కంపెనీలు భారీ ఎత్తున రేట్లు పెంచితే మాత్రం ఈ ఏడాది చివరి వరకు 100 రూపాయలు లీటర్‌ పెట్రోలు అవ్వడం కన్ఫర్మ్‌ అంటూ మార్కెట్‌ వర్గాల వారు అంటున్నారు.అతి త్వరలోనే 90లో పడటం మనం చూడబోతున్నట్లుగా మార్కెట్‌ వర్గాల వారు భయపెడుతున్నారు.

ఇప్పటికే పెట్రోలు చాలా భారం అయ్యింది.ఇలాంటి సమయంలో మళ్లీ రేటు పెంచడం అంటే సామాన్యుడిపై పెను భారం మోపడమే అవుతుంది.

Advertisement

ఇలా ముందు ముందు మరెంతకు వెళ్తుందో అనే ఆలోచన ప్రస్తుతం జనాల్లో ఒణుకు పుట్టిస్తుంది.

ఆ పాన్ ఇండియా సినిమాలపై ఫుల్‌ నెగిటివిటీ.. చెర్రీ తారక్‌లకు వణుకు పుడుతోందట..?
Advertisement

తాజా వార్తలు