గత కొద్ది కాలం నుండి ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకర్స్ హ్యాక్ చేయడం మొదలుపెట్టారు.ఇలా వారు హ్యాక్ చేసి ప్రముఖుల సోషల్ మీడియా నుండి అనవసరమైన పోస్టులు చేయడం, లేదా తప్పుడు సమాచారాన్ని చేరవేయడం వంటి పనులు చేస్తున్నారు.
ఇలా అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులను హ్యాకర్లు తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు.గత వారం రోజుల కిందట టాలీవుడ్ కు చెందిన సింగర్ స్మిత సోషల్ మీడియా అకౌంట్ ను కూడా హ్యాక్ చేసిన అధికారులు కొన్ని అసభ్య పోస్ట్ లు చేసిన సంగతి కూడా విధితమే.
ఇకపోతే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ ట్విట్టర్ అకౌంట్ ను కూడా కొందరు హాకర్స్ హ్యాకింగ్ చేశారు.ఈ విషయాన్ని ఈశా రెబ్బ స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
తన ట్విట్టర్ అకౌంట్ ను హ్యాకర్స్ హ్యాక్ చేశారని, దాన్ని నేను ఓపెన్ చేస్తే మీ అకౌంట్ లేదని చూపిస్తుందని ఈషా రెబ్బ తెలియజేసింది.తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో నిత్యం తన అభిమానులతో ముచ్చటిస్తూ తనకు సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తున్న ఈషా రబ్బా ఇప్పుడు తన అకౌంట్ హ్యాక్ అవడంతో సంబంధిత పోలీసు అధికారులకు హీరోయిన్ ఫిర్యాదు చేసింది.

ఓవైపు పోలీసులు, మరో వైపు ఈషా రబ్బా టెక్నికల్ టీం కూడా ఈ విషయంపై కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.ఇక ప్రస్తుతం ఈమె ‘ఈషా లస్ట్ స్టోరీస్’ అనే తెలుగు రీమేక్ లో తన అందాలను ఆరబోస్తుంది.ఏది ఏమైనా ప్రముఖుల అకౌంట్ హ్యాక్ చేయడం ద్వారా వారికి పెద్ద తలనొప్పులే వస్తున్నాయి.