పందులతో వాకింగ్( Pig Walking ) చేస్తే ఆరోగ్యానికి శుభకరం, ఆనందం ఏంట్రా బాబు… ఏమైనా పిచ్చి పట్టిందా? అని అడగాలనిపిస్తుంది కదూ.మీరు విన్నది నిజమే.
సాధారణంగా పందిని చూసి చాలామంది అసహ్యించుకుంటారు.మరి కొంతమంది దేవుని వరాహావతారంగా భావించి గౌరవిస్తుంటారు.
కానీ, ఇంగ్లండ్‌కు( England ) చెందిన జూలియా బ్లేజర్ మాత్రం వాటిని డాక్టర్లుగా ఫీల్ అవుతోంది.అవును, తన పెంపుడు పందులైన ‘హాజెల్’, ‘హోలీ’లే ఆమెకి డాక్టర్లని చెబుతోంది జూలియా.
ఈ క్రమంలో ఆమె 2015లో ‘గుడ్ డే అవుట్’( Good Day Out ) పేరుతో యూనెస్కోలోని బ్రీకాన్స్ నేషనల్ పార్క్‌లో చికిత్స కేంద్రాన్ని కూడా నిర్మించింది.ఇక్కడే రోజూ హాజెల్, హోలీ అనే ఈ 2 వరాహాలు మనుషులకు చికిత్సను అందిస్తున్నాయి.ఐతే దీనికి ఓ ఫ్లాష్ బ్యాక్ వుంది.జూలియాకు ఒకప్పుడు ఊపిరి ఆడనంతగా ఒత్తిడి, డిప్రెషన్ ఉండేదట.వాటితో ఆమె ఉక్కిరిబిక్కిరి అయినపుడు ఆ రెండు పందులే ఆమెకు ఊరటనిచ్చాయని చెప్పుకొస్తోంది.
వాటి వల్లనే ఆమె కోల్పోయిన ప్రశాంతతను పొందారట.రోజూ వాటితో వాకింగ్ చేస్తే, తన మనసు కుదుట పడేదని చెబుతోంది.వరాహాలతో తాను పొందిన ప్రయోజనాన్ని గుర్తించిన వెంటనే, తనలాగే బాధపడే వారికి ‘పిగ్ వాకింగ్ థెరపీ’( Pig Walking Therapy ) పేరుతో చికిత్స అందించాలని ఆమె అప్పుడే నిర్ణయించుకుందట.
అలా అప్పటినుండి ఇప్పటి వరకు ఎంతోమంది ఈ రెండు పందులతో షికారుకెళ్లి ఆనందం, ఆరోగ్యం పొందుతున్నారని భోగట్టా.ఇక్కడ కేవలం పందులే కాదు, గాడిదలు, గుర్రాలు కూడా వైద్యం అందిస్తున్నాయి.ఒక్కో రకం చిక్సితకు గంటకు రూ.4 వేల నుంచి రూ.14 వేల వరకు ఆమె ఫీజు వసూలు చేస్తోందని చెబుతోంది.పైగా వాటికి భారీ డిమాండ్ ఉందని అంటోంది.