బీబీసీపై పరువునష్టం దావా కేసు నమోదైంది.ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో గుజరాత్ ఎన్జీవో కేసు దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
భారత న్యాయవ్యవస్థతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టను కించపరిచారని పిటిషన్ లో పేర్కొంది.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం బీబీసీ సహా ప్రతివాదులకు సమన్లు జారీ చేసింది.
అనంతరం ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ కు వాయిదా వేసింది.







