హైదరాబాద్, డిసెంబర్ 21, 2022 – ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక రేటింగ్ పొందిన జీఈసీ ఛానెల్ జీ తెలుగు.ప్రతీ ఏడాదిలానే ఈ 2022లో కూడా అద్భుతమైన కార్యక్రమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
ఇక ఈ ఏడాదికి గుడ్‌బై పలుకుతున్న వేళ… మరింత వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో జీ తెలుగు ఫంటాస్టిక్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది.డిసెంబర్ 25, ఆదివారం, సాయంత్రం 6 గంటలకు మొట్టమొదటిసారిగా ఫంటాస్టిక్ అవార్డులను అందించడం ద్వారా ఈ క్రిస్మస్ రోజున ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది జీ తెలుగు.
ఆద్యంతం హాస్యభరితంగా మరియు వినోదాత్మకంగా నిర్వహించిన ఈ ఫంటాస్టింక్ అవార్డు కార్యక్రమంలో టీవీ సెలబ్రిటీలు కొన్ని ఫన్నీ అవార్డులను పొందేందుకు పోరాడారు.వారు పోరాడే విధానం చూస్తే.
ఈ షోని మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చూసేటప్పుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం గ్యారంటీ అని చెప్పవచ్చు.
ఇక ఫంటాస్టిక్ అవార్డుల విషయంలో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ కార్యక్రమాన్ని ఎనర్జిటిక్ యాంకర్లు అయినటువంటి రవి మరియు సిరి తమ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు.
వారి కామెడీ సెన్స్ గురించి అందరికి తెలిసిందే.ప్రేక్షకులను తమ జోక్‌లతో అద్భుతంగా అలరించారు.
అంతేకాదు మెగాస్టార్ అప్‌కమింగ్ మూవీలోని బాస్ పార్టీ పాటతో వారిద్దరూ అద్భుతంగా డ్యాన్స్ కూడా చేశారు.ఇదే కాకుండా చాలా పాపులర్ అయినటువంటి జీ తెలుగు జోడిలు కూడా మంత్రముగ్దులను చేసే పర్‌ఫార్మెన్స్‌లతో అందరి హృదయాలను గెల్చుకుంటారు.
వీటితోపాటు మానస్ మరియు విష్ణు ప్రియ వైరల్ పాట జరీ జరీతో వేదికను రాక్ చేయనున్నారు.మున్నా – హర్షల, గోకుల్ – దీప్తి, సిసిర్ – నిసర్గ, పవన్ – పద్మిని, యశ్వంత్ – అంజనాల రొమాంటిక్ యాక్ట్స్ తో అలరించనున్నారు .
అంతేకాకుండా జీ తెలుగు అగ్ర కథానాయికలు – ఆషిక, నిసర్గ, సౌందర్య, పూజ, చైత్ర మరియు సుస్మిత యొక్క పర్‌ఫార్మెన్స్‌లు అవార్డుల కార్యక్రమాన్ని మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి.ఇక మాస్ సాంగ్స్‌లో సిజ్లింగ్ యాక్ట్ తప్పకుండా మీమ్మల్నిఆకట్టుకుంటుంది.
ఎంటర్‌టైన్‌మెంట్ ఇక్కడితో అయిపోలేదు.సాయి కిరణ్ మరియు ప్రీతి శర్మల పాటలు, అన్ని సీరియల్ నటుల ప్రత్యేక స్కిట్‌లు, సూపర్ స్టార్ కృష్ణకు తన పాటలతో అకుల్ బాలాజీ అర్పించిన ఘన నివాళిని ఈకార్యక్రమంలో ఉన్నాయి.
ఇక ఫైనల్‌గా ఆర్టిస్టులందరూ క్రిస్మస్ పండుగను మరియు కొత్త సంవత్సరాన్ని కేక్ కటింగ్‌తో జరుపుకున్నారు.ఆనందకరమైన రాత్రి మంచి బ్యాంగ్ తో ముగిసింది.