ఎంసెట్ ఎంట్రన్స్ ఫీజు తగ్గించాలి:-ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర కమిటీ డిమాండ్

హైదరాబాద్:ఉన్నత విద్యామండలి,ఎంసెట్ తో పాటు అన్ని ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేశారు నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి ఎంసెట్,ఈసెట్ ఫీజులను ఖరారు చేశారు ఈ ఫీజులు ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయని,వెంటనే ఎంసెట్ ఫీజులు తగ్గించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్ష,కార్యదర్సులు ఆర్ ఎల్ మూర్తి, టి నాగరాజు ఒక ప్రకటన లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 Emset Entrance Fee Should Be Reduced -sfi State Committee Demand, Emset Entrance-TeluguStop.com

ప్రధానంగా రాష్ట్రంలో అత్యధికంగా 2.51లక్షల మంది రాసే ఎంసెట్ పరీక్షలో ఎస్.సి,ఎస్.టి మరియు పి.హెచ్.విద్యార్ధులకు ఏంట్రస్ ఫీజు 400 కాగా బి.సి.మరియు ఇతర విద్యార్ధులకు 800 గా నిర్ణయించారని ఇది దుర్మార్గపు చర్యగా వారు మండిపడ్డారు.పొరుగున ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్.సి.ఎస్.టి., విద్యార్ధులకు 500 ఉంటే, బి.సి విద్యార్థులకు 550 మరియు ఇతర విద్యార్ధులకు 600 ఉన్నదని, తెలంగాణ లో కూడా అదే విధంగా బీసీ విద్యార్థులకు ఆలాంటి మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.ఉన్నత విద్యామండలి, కరోనా సయమంలో సి.ఎం.సహయ నిధికి 10 కోట్లు విరాళాలు ఇస్తుంది కానీ విద్యార్ధులకు ఫీజులు మాత్రం తగ్గించలేరా.అంటూ ప్రశ్నించారు.పేద బీసీ విద్యార్థులకు ఎందుకు ఫీజులో మినహాయింపు ఇవ్వడం లేదో చెప్పాలాని, తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ తో పాటు ఇతర అన్ని సెట్లలో ఫిజులు కూడా తగ్గించి విద్యార్థులు అందరికి అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు.

ఏపీలో మాదిరిగా తెలంగాణ లోనూ బీసీ విద్యార్థులకు ఫీజులో రాయితీ కల్పించాలి.లేకుంటే ఖచ్చితంగా ఉన్నత విద్యామండలి కార్యాలయాని ముట్టడిస్తామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube