ప్రతి విద్యార్థికి పదో తరగతిలో( Tenth Class ) మంచి మార్కులు సాధించడం కల అనే సంగతి తెలిసిందే.పది ఫలితాలలో మంచి మార్కులు వస్తే భవిష్యత్తులో కూడా మంచి ఉద్యోగాలలో స్థిరపడవచ్చని, కన్న కలలను సులువుగా నెరవేర్చుకోవచ్చని చాలామంది భావిస్తారు.
ప్రభుత్వ పాఠశాలలలో( Govt School ) చదివి స్టేట్ లెవెల్ లో మార్కులు సాధించడం సులువు కాకపోయినా కొందరు విద్యార్థులు మాత్రం ఎంతో కష్టపడి ఆ కలలను నిజం చేసుకుంటున్నారు.
ఏలూరు జిల్లా( Eluru ) పెదపాడు మండలంలోని వట్లూరు ప్రభుత్వ పాఠశాలలో చదివిన గాయత్రి( Gayatri ) అనే విద్యార్థిని పదో తరగతి పరీక్షల్లో 590 మార్కులు సాధించడం గమనార్హం.
ఈమె తండ్రి పేరు రమేష్ కాగా కూలీ పని చేస్తూ రమేష్ తన కూతురిని చదివించారు.పది ఫలితాలలో గాయత్రికి మంచి మార్కులు రావడంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కెరీర్ పరంగా గాయత్రి మరింత ఎదగాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
ఏపీలో గతేడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చాయి.ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి ఫలితాలను సాధించడం విద్యార్థుల తల్లీదండ్రుల సంతోషానికి కారణమవుతోంది.ఏపీలోని చాలా మండలాల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఫలితాలను సొంతం చేసుకున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ఏపీ గురుకుల పాఠశాలల్లో ఏకంగా 95.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.నాడు నేడు వల్ల ఏపీలో ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు సైతం మెరుగుపడ్డాయి.
విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ఏపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం అందుతోంది.పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు వచ్చే నెలలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు.
పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల విషయంలో టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.పది పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు కొంతమంది రాజకీయ నేతలు ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు.